Charlie Kirk: క్యాంపస్ బిల్డింగ్ రూఫ్ నుంచి షూట్ చేశాడు..
Charlie Kirk: కన్జర్వేటివ్ నేత ఛార్లీ కిర్క్‌ను ఇవాళ దారుణంగా హత్య చేశారు. ఉటా వర్సిటీలో ఉన్న ఓ బిల్డింగ్ రూఫ్ మీద నుంచి నిందితుడు కాల్పులు జరిపినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. కిర్క్ మెడలోకి బుల్లెట్ దిగింది. నిందితుడి కోసం గాలింపు జరుగుతోంది.
న్యూయార్క్ : ఉటా యూనివర్సిటీలో కన్జర్వేటివ్ నేత ఛార్లీ కిర్క్(Charlie Kirk)ను ఇవాళ దారుణంగా హత్య చేశారు. అయితే వర్సిటీలో ఉన్న ఓ బిల్డింగ్ రూఫ్ మీద నుంచి నిందితుడు కాల్పులు జరిపినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. క్యాంపస్ కోర్టుయార్డ్ సమీపంలో ఉన్న బిల్డింగ్ నుంచి ఆ కాల్పుల ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కిర్క్ మెడలోకి బుల్లెట్ దిగినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతున్నది. తొలుత ఓ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఆ తర్వాత వాళ్లను వదిలేశారు. టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ అనే సంస్థను కిర్క్ స్థాపించారు. షూటింగ్ ఘటనపై ఎఫ్‌బీఐ అధికారులు విచారణకు సహకరిస్తున్నారు.
కిర్క్ హత్య పట్ల నేతలు స్పందిస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఆ కాల్పుల ఘటనను ఖండించారు. బెవర్లీహిల్స్ సెలబ్రిటీలు కూడా ఈ హత్యను ఖండించారు. అమెరికాలో ఇది చీకటి రోజు అని పేర్కొన్నారు. యువతను ఆకర్షించడంలో.. వాళ్లు తనకు ఓటు వేసేలా చేయడంలో కిర్క్ కీలక పాత్ర పోషించినట్లు ట్రంప్ అన్నారు. ఎఫ్‌బీఐ ప్రజలకు అభ్యర్థన చేసింది. షూటింగ్ ఘటనకు చెందిన ఫోటోలు, వీడియోలు షేర్ చేయాలని కోరింది. కన్జర్వేటివ్ నేత కిర్క్‌ను చూసేందుకు ఉటా వాలీ వర్సిటీకి వేల సంఖ్యలో యువత చేరుకున్నారు. అక్కడ భారీగా భద్రతను ఏర్పాటు చేయలేదు.
Video currently on the Wall Street Journal home page appears to show the Charlie Kirk shooter on the roof of Utah Valley University’s Losee Center.https://t.co/Tifdiddz1v pic.twitter.com/L0qizcFfVG
— MarikvR (@MvonRen) September 11, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

