డ్రింక్స్ అనుకుని శానిటైజర్ తాగి అస్వస్ధతకు లోనైన అథ్లెట్లు
రేసింగ్ పోటీలో డ్రింక్స్ కలిసిపోవడంతో పొరపాటున స్కూల్ అథ్లెట్లు హ్యాండ్ శానిటైజర్ తాగిన ఘటన జపాన్‌లో వెలుగుచూసింది.
టోక్యో : రేసింగ్ పోటీలో డ్రింక్స్ కలిసిపోవడంతో పొరపాటున స్కూల్ అథ్లెట్లు హ్యాండ్ శానిటైజర్ తాగిన ఘటన జపాన్‌లో వెలుగుచూసింది. ఈ ఘటనలో ముగ్గురు అథ్లెట్లు అస్వస్ధతకు లోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శానిటైజర్ తాగిన తర్వాత ఓ అథ్లెట్ కుప్పకూలాడు.
వాంతులు కావడంతో అధికారులు ఆస్పత్రికి తరలించారు. బాలికల 5000 మీటర్ల వాకింగ్ రేస్ గత వారాంతంలో జపాన్‌లోని యమనషిలో జరగ్గా నిర్వాహకులు అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన డ్రింక్స్ స్టేషన్లో పొరపాటుగా కప్పుల్లో శానిటైజర్‌ను నింపారు.
కార్డుబోర్డు బాక్స్‌లో ఉన్న తాగునీటి బాటిల్స్ పక్కనే ప్లాస్టిక్ బాటిల్లో శానిటైజర్ ఉండటంతో పొరపాటున ఆయా కప్పుల్లో శానిటైజర్‌ను నింపారని యమనషి హైస్కూల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని యమనషి గవర్నర్ కొటరొ నగషకి వెల్లడించారు. బాధిత అథ్లెట్లు వారి కుటుంబాలకు తాను క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

