మాకు ముందే నోటీస్ ఇచ్చారు.. సర్మాట్ పరీక్షపై అమెరికా
వాషింగ్టన్: ఆర్ఎస్-28 సర్మాట్ ఖండాంతర క్షిపణిని రష్యా పరీక్షించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా ఓ ప్రకటన చేసింది. సర్మాట్ పరీక్ష ఓ రొటీన్ టెస్ట్ అని, ఆ క్షిపణితో తమకు ఎటువంటి ప్రమాదం లేదని అమెరికా రక్షణశాఖ పెంటగాన్ తెలిపింది. సర్మాట్ క్షిపణి పరీక్ష ఆశ్చర్యకరం కాదు అని, ప్రస్తుతం ఆయుధ నియంత్రణ ఒప్పందాల ప్రకారం తమకు ముందే ఆ పరీక్ష గురించి రష్యా నోటిస్ ఇచ్చిందని పెంటగాన్ అధికారులు వెల్లడించారు.
కొత్త ఒప్పందం ప్రకారమే రష్యా ఆ ఐసీబీఎం పరీక్ష చేసినట్లు పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఆర్ఎస్-28 సర్మాట్ ఐసీబీఎంను ప్లిసెట్కీ మిలిటరీ కాస్మోడ్రోమ్ నుంచి పరీక్షించారు. సర్మాట్ ఆయుధం తమ సైనిక సత్తాను మరింత పెంచుతోందని పరీక్ష తర్వాత పుతిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఈ కొత్త మిస్సైల్ చేధించగలదు.
ప్లిసెట్కీ నుంచి ఎగిరిన ఈ మిస్సైల్.. రష్యా మొత్తం చుట్టి చివరకు తూర్పు తీరం వద్ద ఉన్న కామ్చట్కా దీవిలో టార్గెట్‌ను ఢీకొట్టింది. అయితే ఈ ఏడాది చివరి వరకు సర్మాట్ ట్రయల్స్ పూర్తి అవుతాయని, ఆ తర్వాత అధికారికంగా క్షిపణి దళంలోకి చేరుతుందన్నారు. ఆర్-36 వోయివోడా ఐసీబీఎంతో పాటు సర్మాట్కు హైపర్సోనిక్ గ్లైడర్ వార్‌హెడ్స్‌ను ఫిక్స్ చేయవచ్చు అని రష్యా రక్షణ శాఖ చెప్పింది.
‘సర్మాట్’ విశేషాలు
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి.
ప్రపంచంలో ఏ మూలన ఉన్న లక్ష్యాన్నైనా ధ్వంసం చేయగలదు.
ఈ క్షిపణిని అభివృద్ధి చేయడానికే 20 ఏండ్ల సమయం పట్టింది.
అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. 10 వార్హెడ్లనూ తీసుకెళ్తుంది.
భిన్న టార్గెట్లను నాశనం చేసే 200 టన్నుల వార్హెడ్లనూ మోయగలదు.
క్షిపణి నాశక వ్యవస్థ, శత్రు నిఘా వ్యవస్థ నుంచి తప్పించుకోగలదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

