Same sex marriage bill | స్వలింగ వివాహ బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది. తుది ఆమోదం కోసం ఇప్పుడు ఈ బిల్లును ప్రతినిధుల సభకు పంపిస్తారు. అనంతరం దేశాధ్యక్షుడు జోబైడెన్ బిల్లుపై సంతకం చేయడంతో అది చట్టంగా మారనున్నది. ఈ ప్రక్రియ మొత్తం వచ్చే ఏడాది జనవరి మాసాంతానికల్లా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 32 దేశాలు మాత్రమే స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపునిచ్చాయి. 120 దేశాలు స్వలింగ సంపర్కం నేరంగా పరిగణిస్తున్నాయి.
ఈ బిల్లు చట్టంగా మారిన వెంటనే స్వలింగ వివాహాలకు గుర్తింపు లభిస్తుంది. సుప్రీంకోర్టు 2015 లో ఈ రకం వివాహాలను దేశవ్యాప్తంగా నిషేధించింది. సెనేట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందడంపై అధ్యక్షుడు జో బైడెన్ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలో నివసిస్తున్న ప్రతి పౌరుడు తనకు నచ్చిన రీతిలో వివాహం చేసుకోవడానికి అనుమతించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, గత జూన్ నెలలో అబార్షన్ హక్కులను పరిరక్షించే తీర్పును అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అప్పటి నుంచి అమెరికాలో స్వలింత వివాహాలు ప్రమాదంలో పడనున్నాయని ప్రజలు భయపడ్డారు. అయితే, జో బైడెన్ ప్రభుత్వం స్వలింగ వివాహాలను గుర్తించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లుపై అధ్యక్షుడు బైడెన్ వచ్చే ఏడాది జనవరి లోపు సంతకం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే జనవరి నెలాఖరుకల్లా ప్రతినిధుల సభ డోనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లిక్ పార్టీ ఆధీనంలోకి వెళ్లనున్నది.