50 దేశాలు.. లక్ష మంది బాధితులు
రష్యాలో భారీ స్కామ్ వెలుగుచూసింది. భారత్ సహా 50కిపైగా దేశాల్లోని లక్ష మందికిపైగా పౌరులను మోసగించిన నకిలీ కాల్ సెంటర్ గుట్టును ఆ దేశ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) ఛేదించింది.
- రోజుకు 8 కోట్లు లూటీ
- రష్యాలో భారీ స్కామ్
- బాధితుల్లో భారతీయులు
మాస్కో, డిసెంబర్ 10: రష్యాలో భారీ స్కామ్ వెలుగుచూసింది. భారత్ సహా 50కిపైగా దేశాల్లోని లక్ష మందికిపైగా పౌరులను మోసగించిన నకిలీ కాల్ సెంటర్ గుట్టును ఆ దేశ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) ఛేదించింది. పెట్టుబడుల నెపంతో ఈ ముఠా భారత్‌కు చెందని పలువురిని కూడా లక్ష్యంగా చేసినట్టు ఎఫ్ఎస్బీ తెలిపింది.
దీనికి సంబంధించిన వీడియోను ఎఫ్ఎస్బీ షేర్ చేసింది. భారీ యెత్తున మోసాలకు పాల్పడే అంతర్జాతీయ వ్యవస్థీకృత ముఠా ఈయూ, యూకే, కెనడా, బ్రెజిల్, భారత్, జపాన్ ప్రజలను లక్ష్యంగా చేసుకునేది.పెట్టుబడులు, ఇతర ఆర్థిక ప్రలోభాల పేరుతో పౌరులను మోసగించి రోజుకు 1 మిలియన్ డాలర్లు (రూ.8 కోట్లు) వరకు ఆదాయం పొందేది. ఈ కాల్ సెంటర్ ఉద్యోగులు తరచూ భారత్‌కు చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకునే వారు.
డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ ఉన్న భారత్ పౌరులను అధిక వడ్డీ, నకిలీ బీమాల పేరుతో వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడే వారు. కాల్‌సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు ప్రధాన నిందితులతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రష్యాలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద ముప్పును వ్యాప్తి చేయడానికి ఈ కాల్‌సెంటర్‌కు 2022లో ఉక్రెయిన్‌కు చెందిన ఎస్‌బీయూ సెక్యూరిటీ సంస్థ నుంచి ఆదేశాలు వచ్చాయని ఎఫ్‌బీఐ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

