మాస్కో: జననాల రేటు తగ్గిపోతుండటంపై రష్యా తీవ్ర ఆందోళన చెందుతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో జనాభా గణనీయంగా పడిపోతుందని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు కొత్త ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రజలకు ఆరోగ్య మంత్రి యెగ్వెని షెస్కోపలోవ్ పలు సూచనలు చేశారు. ‘పనిలో తీరిక లేకుండా ఉన్నామని చెప్పడం సరైన కారణం కాదు. ఇలా చెప్పడం సాకు మాత్రమే. మీరు పనిలో ఉన్నప్పటికీ లంచ్, కాఫీ బ్రేక్లను పిల్లలను కనేందుకు ఉపయోగించుకోండి’ ఆయన ప్రజలకు సూచించారు. రష్యా ప్రభుత్వం 18 నుంచి 40 ఏండ్ల మహిళలకు ఉచిత సంతాన సాఫల్య కేంద్రాలు సైతం నిర్వహిస్తున్నది.