ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా
ఉక్రెయిన్‌లోని కొమిషువకాలోని ఓ స్కూల్ భవనంపై రష్యా సోమవారం తొమ్మిది బాంబులు వేయడంతో కనీసం 31 మంది దుర్మరణం చెందారు. 48 మంది గల్లంతయ్యారు. ఈ భవనాన్ని షెల్టర్‌గా, మానవతా సాయం పంపిణీ కేంద్రంగా వాడుతున్నట్టు స్థానిక గవర్నర్ సెమికిన్ తెలిపారు.
- 31 మంది దుర్మరణం
- 48 మంది గల్లంతు, 62 మందికి గాయాలు
కీవ్: ఉక్రెయిన్‌లోని కొమిషువకాలోని ఓ స్కూల్ భవనంపై రష్యా సోమవారం తొమ్మిది బాంబులు వేయడంతో కనీసం 31 మంది దుర్మరణం చెందారు. 48 మంది గల్లంతయ్యారు. ఈ భవనాన్ని షెల్టర్‌గా, మానవతా సాయం పంపిణీ కేంద్రంగా వాడుతున్నట్టు స్థానిక గవర్నర్ సెమికిన్ తెలిపారు. ఈ దాడిని అత్యంత భయానకమైనదిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభివర్ణించారు. అమెరికా మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాల్పుల విరమణ పాటించాలన్న అమెరికా సూచన పెడచెవిన పెట్టి రష్యా ఈ దాడులకు పాల్పడిందని విమర్శించారు.
అంతకు ముందు తమ దేశ ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా వందలాది డ్రోన్లు, డజన్ల కొద్దీ శక్తివంతమైన క్రూయిజ్, ఖండాంతర క్షిపణులను ప్రయోగించిందని ఆయన వెల్లడించారు. ‘మా గగనతలాన్ని రక్షించుకోవడానికి సహాయం కావాలి. లేకపోతే రష్యా తన క్షిపణి దాడులను ఎప్పటికీ ఆపదు. నిజాయితీగా శాంతిని నెలకొల్పడంలో సహాయం అత్యవసరం.
అమెరికా ఆ పని చేయగలదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఖర్గీవ్పై జరిగిన మరో దాడిలో కనీసం 62 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. మంగళవారం ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో దవాఖానలపై రష్యా దాడులు చేసింది. మరోవైపు సోమవారం రాత్రి 856 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా రక్షణ మంత్రి తెలిపారు. ఇందులో 493 డ్రోన్లు రాజధాని మాస్కోపై ప్రయోగించారని నగర మేయర్ సబ్యనిన్ వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

