Russia | పుతిన్‌కి పిచ్చి పట్టిందనడం మానుకోవాలి.. ఇంటర్వ్యూ ఇచ్చిన బెలారస్ ప్రెసిడెంట్
ఉక్రెయిన్‌పై రష్యా సేనలు దాడి చేయడంతో చాలా పశ్చిమ దేశాల నేతలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు పిచ్చి పట్టటిందని, పారానాయిడ్గా ఉన్నారని విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే రష్యా మిత్రదేశం బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఒక జపనీస్ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుతిన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. ‘‘పుతిన్ మానసికంగా, శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన మానసిక ఆరోగ్యం సరిగా లేదనే భ్రమ నుంచి పశ్చిమ దేశాలు, మీరు బయటకు రావాలి’’ అని తేల్చేశారు. తాను పక్కదేశం అధ్యక్షుడిగానే కాకుండా, ఒక మిత్రుడిగా పుతిన్‌ను పలుమార్లు కలిశానన్నారు.
జపాన్ కూడా ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అందుకే లుకాషెంకో వారిని కూడా విమర్శించారు. 69 ఏళ్ల పుతిన్ పూర్తి ఫిట్‌గా ఉన్నారని, ఆయన బుర్ర సరిగా పనిచేయడం లేదని పశ్చిమ దేశాలు అనడం సరికాదని అన్నారు.
యూఎస్ఎస్ఆర్గా ఉన్న రష్యా కూలిపోవడం చాలా బాధకరమైన ఘటన అని చెప్పిన ఆయన.. యూఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు ప్రపంచం అంతా రెండు దిశల్లో వెళ్లేదని, ఒక వర్గాన్ని మరొక వర్గం బ్యాలెన్స్ చేసేదని చెప్పారు. ఒకసారి అది కూలిపోవడంతో పూర్తిగా ప్రపంచాన్ని అమెరికా వైపు కదలడం మొదలైందని, ప్రస్తుతం ప్రపంచం ఇలా అవడానికి అదే కారణమని వివరించారు.
కాగా, బెలారస్ గడ్డ మీద నుంచే రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించాయి. ఉక్రెయిన్ దళాల కన్నా రష్యా దళాలు శక్తిమంతమైనప్పటికీ.. ఉక్రెయిన్‌లో ఎక్కువ ప్రాంతాన్ని వాళ్లు ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయారు. ఇప్పటి వరకు సుమారు ఏడు వేల మంది రష్యన్ సైనికులు ఉక్రెయిన్ దళాల చేతుల్లో మరణించినట్లు సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Belarus
- Russia
- Telugu News
- Ukraine
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

