వాషింగ్టన్, ఫిబ్రవరి 24: రష్యాతో యుద్ధం వల్ల తీవ్ర కష్టాల్లో ఉన్న ఉక్రెయిన్‌కు ఆర్థికసాయం అందించేందుకు అమెరికా మరోసారి ముందుకొచ్చింది. రూ.16,500 కోట్ల ఆయు ధ సహాయ ప్యాకేజీని అమెరికా సిద్ధం చేస్తున్నట్టు పలు సంస్థలు వెల్లడించాయి.
ఉక్రెయిన్‌పై దాడికి ఏడాది పూర్తయిన సందర్భంగా మరో సైనిక దాడికి రష్యా ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో అమెరికా ఆర్థిక సాయం రెడీ అవుతున్నదని తెలిపాయి.