లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న భారతసంతతి వ్యక్తి రిషి సునాక్కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. అక్కడి అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు జై కొడుతున్నారు. తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్లో మెజారిటీ ఓటర్లు రిషి సునాక్ వైపే మొగ్గుచూపారు. రిషి ఎంపికైతే ‘మంచి ప్రధాని’గా ఆయన రాణిస్తారని వారు ఆశాభావం వ్యక్తంచేసినట్టు ఆదివారంనాటి ఒపీనియన్ పోల్ వెల్లడించింది.