కాలిఫోర్నియా: అమెరికా శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారు. న్యూక్లియర్ ఫ్యూజన్ పద్ధతిలో తొలిసారి అమితమైన శుద్ధ శక్తిని ఉత్పత్తి చేశారు. కాలిఫోర్నియాలోని నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ సెంటర్లో శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను డెవలప్ చేశారు. అమెరికా ఇంధన శాఖ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నది.
అంతులేని, సురక్షితమైన, శుద్ధ శక్తిని తయారు చేసేందుకు కొన్ని దశాబ్ధాల నుంచి అమెరికా శాస్త్రవేత్తలు ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. సూర్యశక్తిని రిలీజ్ చేసే న్యూక్లియర్ ఫ్యూజన్ పద్ధతిలో శాస్త్రవేత్తలు శుద్ధ శక్తి ఉత్పత్తి కోసం ప్రయోగాలు చేపట్టారు. డ్యుటీరియం, ట్రిటియం లాంటి మూలకాలతో ఫ్యూజన్ ప్రక్రియ నిర్వహించారు.
కేవలం 2.1 ఎంజే ఉష్ణంతో లేజర్లను వేడి చేసి దాని ద్వారా సుమారు 2.5 ఎంజే ఎనర్జీని పరిశోధకులు క్రియేట్ చేశారు. తాము అద్భుతమైన ఘనతను సాధించినట్లు ప్లాస్మా ఫిజిక్స్ గ్రూపు డాక్టర్ రాబీ స్కాట్ తెలిపారు. ప్యూజన్తో కార్బన్ రహిత శక్తిని రిలీజ్ చేసినట్లు చెప్పారు.