Smart Soil | అన్నీ స్మార్ట్‌గా మారిపోతున్నాయ్.. చివరికి మట్టి కూడా..
నేటి టెక్ యుగంలో అన్ని స్మార్ట్‌గా మారిపోతున్నాయ్. చివరికి మట్టి కూడా స్మార్ట్ అయిపోతున్నది. మీరు విన్నది నిజమే. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు స్మార్ట్ మట్టిని ఆవిష్కరించారు.
- 40 శాతం తక్కువ నీటి వినియోగం
- 138% అధికంగా పంట ఎదుగుదల
- టెక్సాస్ యూనివర్సిటీ ఆవిష్కరణ
Smart Soil | వాషింగ్టన్, జూలై 22: నేటి టెక్ యుగంలో అన్ని స్మార్ట్‌గా మారిపోతున్నాయ్. చివరికి మట్టి కూడా స్మార్ట్ అయిపోతున్నది. మీరు విన్నది నిజమే. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు స్మార్ట్ మట్టిని ఆవిష్కరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి జరుగడం లేదు. నీటి కొరత, ఎరువుల వినియోగం.. వ్యవసాయ రంగంలో అతిపెద్ద సవాల్‌గా మారాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు టెక్సాస్ వర్సిటీ పరిశోధకులు ప్రత్యేకంగా తయారుచేసిన ‘హైడ్రోజెల్’ను మట్టిలో కలిపి ‘స్మార్ట్ మట్టి’ని రూపొందించారు.
ప్రయోజనాలేంటి?
తక్కువ నీటితో పంట వేగంగా ఎదిగేలా చేయడమే ఈ స్మార్ట్ మట్టి ప్రత్యేకత. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ‘స్మార్ట్ మట్టి’లో పంటల సాగు అక్కడి జనాభా ఆహార అవసరాలను తీర్చుతుందని అధ్యయనం పేర్కొన్నది. హైడ్రోజెల్‌తో తయారుచేసిన ‘స్మార్ట్ మట్టి’లో మొక్కలకు నీరు, పోషకాలు ఓ క్రమ పద్ధతిలో అందుతాయి. ల్యాబ్‌లో చేపట్టిన ప్రయోగాల్లో, నీటి వినియోగం 40 శాతం తగ్గింది. పంట ఎదుగుదలను 138శాతం పెంచింది. విస్తారమైన వ్యవసాయ క్షేత్రాల్లో ఈ కొత్త టెక్నాలజీతో ప్రయోగాలు చేయడానికి సైంటిస్టులు సిద్ధమవుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- Researchers
- Smart Soil
- soil
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

