ఆగని ఉద్యోగ కోతలు
ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. అందులో భాగంగా భారత్‌లోని వెయ్యి మందిపై సంస్థ వేటువేయనుంది. గత నెలలో సీఈవో క్రిస్టియానో అమోన్ జారీ చేసిన మెమో తర్వాత కంపెనీ ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఈ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన మరిన్ని వివరాలు మెమో ద్వారా వెల్లడయ్యాయి.
- క్వాల్కామ్, పెప్సీకోలో భారీగా లే ఆఫ్‌లు
న్యూయార్క్: ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. అందులో భాగంగా భారత్‌లోని వెయ్యి మందిపై సంస్థ వేటువేయనుంది. గత నెలలో సీఈవో క్రిస్టియానో అమోన్ జారీ చేసిన మెమో తర్వాత కంపెనీ ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఈ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన మరిన్ని వివరాలు మెమో ద్వారా వెల్లడయ్యాయి. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 52 వేల మంది సిబ్బందిలో ఏడు శాతం అనగా 3,600 ఉద్యోగాలకు సంస్థ కోత విధించనుంది. మరో విడత తొలగింపులు వచ్చే ఏడాది జనవరిలో జరుగుతాయని ఆ కథనం పేర్కొంది.
ఈ కోతలు సీనియర్ ఇంజినీర్లతో పాటు ఇటీవల నియమితులైన వారిని కూడా ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. కాగా, తొలగిస్తున్న ఉద్యోగులకు పరిహారంగా మూడు నెలల జీతంతో పాటు సర్వీస్ చేసిన ప్రతి ఏడాదికి నెల చొప్పున జీతాన్ని అందజేస్తారు. పెప్సీకోలో వెయ్యి మంది తొలగింపు అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతి ఆహార, పానీయ సంస్థ పెప్సీకో ఉత్తర అమెరికాలోని తన సంస్థలో వెయ్యి మందిని వచ్చే వారంలోగా తొలగించనుంది. వాల్‌స్ట్రీట్ కథనం ప్రకారం.. నార్త్ అమెరికా సీఈవో రామ్కృష్ణన్ సోమవారం ఉద్యోగులకు రాసిన లేఖ ద్వారా ఈ లేఆఫ్స్‌ను నిర్ధారించారు. గత నెలలో స్వదేశంలో పేలవమైన పనితీరు కారణంగా పెప్సికో తన వార్షిక ఆదాయ అంచనాలను తగ్గించుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఉత్తర అమెరికా పానీయాల విక్రయ పరిమాణం రెండు శాతం తగ్గింది.
హెచ్-1బీ, గ్రీన్‌కార్డ్ స్పాన్సర్షిప్ నిలిపివేసిన ఐబీఎం
విదేశీ ఉద్యోగుల వీసాలపై ట్రంప్ ఆంక్షలు కఠినతరం చేస్తున్న క్రమంలో అమెరికా టెక్ దిగ్గజం ఐబీఎం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన అతిపెద్ద విభాగమైన ఐబీఎం కన్సల్టింగ్లోని మెజారిటీ ఉద్యోగాలకు హెచ్-1బీ వీసా, గ్రీన్‌కార్డు స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. కన్సల్టింగ్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 1.50 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ విభాగంలోని అమెరికా ఉద్యోగాల్లో మెజారిటీ పోస్ట్‌లకు ఇకపై వీసా, గ్రీన్‌కార్డు స్పాన్సర్షిప్ ఉండదని సంస్థ ప్రతినిధి చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

