పాకిస్థాన్లో ముదురుతున్న ఆర్థిక సంక్షోభం.. పంజాబ్లో పెట్రోల్ పంపులు ఖాళీ
Petrol deficit in Pakisthan | పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు ముదురుతున్నది. వివిధ నిత్యావసర, అత్యవసర వస్తువుల ధరలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో పెట్రోల్ పంపులు ఖాళీ అవుతున్నాయి.
లాహోర్: పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు ముదురుతున్నది. వివిధ నిత్యావసర, అత్యవసర వస్తువుల ధరలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో పెట్రోల్ పంపులు ఖాళీ అవుతున్నాయి. ఆ రాష్ట్రంలోని లాహోర్, గుజ్రన్వాలా, ఫైసలాబాద్ తదితర పెద్ద, చిన్న నగరాల్లో ఖాళీ పెట్రోల్ పంపులు దర్శనమిస్తున్నాయి.
దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సంక్షోభం దెబ్బకు ఇంధన సరఫరా సరిగాలేక రోజురోజుకు మూతపడుతున్న పెట్రోల్ పంపుల సంఖ్య పెరిగిపోతుండటంతో.. ఇంధనం అందుబాటులో ఉన్న పెట్రోల్ పంపుల్లో వాహనదారులు కార్లు, బైకులతో భారీ క్యూలైన్లలో నిలబడాల్సి వస్తుంది. లాహోర్లో మొత్తం 450 పెట్రోల్ పంపులు ఉండగా.. వాటిలో ఇప్పటికే 70 పంపులు మూతపడ్డాయి.
కాగా, పాకిస్థాన్లోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కావాల్సినంత ఇంధనాన్ని సరఫరా చేయడంలో విఫలమయ్యాయని పెట్రోల్ డీలర్లు ఆరోపిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి ఇంధన నిల్వలను హోల్డ్ చేస్తున్నాయని విమర్శిస్తున్నారు. అయితే, పెట్రోల్ డీలర్ల ఆరోపణలను పాకిస్థాన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తోసిపుచ్చుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

