ఫ్లారిడా: కొవిడ్ నుంచి రక్షణ కోసం పాలిచ్చే తల్లులు టీకా వేసుకొంటే.. వారి పిల్లలకూ అది రక్షణ ఇస్తున్నదని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లారిడా పరిశోధకులు గుర్తించారు. టీకా తీసుకొన్న తల్లుల చనుబాలలో కూడా కొవిడ్ యాంటిబాడీలు ఉంటున్నాయని జర్నల్ ఆఫ్ పెరినాటాలజీలో ప్రచురించిన పరిశోధన వ్యాసంలో తెలిపారు. ‘టీకా తీసుకొన్న తల్లుల పాలల్లో కొవిడ్ యాంటిబాడీలు పిల్లలకు ఎలా రక్షణ ఇస్తున్నాయనే విషయాన్ని మా పరిశోధనలో గుర్తించాం’ అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.