Green Energy | న్యూయార్క్, మార్చి 27: భూభ్రమణాన్ని వినియోగించుకొని గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూ అయస్కాంత క్షేత్రం ద్వారా సహజ సిద్ధంగా జరిగే ఈ ప్రక్రియ నుంచి స్వల్ప మొత్తంలో విద్యుత్తును ఉత్పత్తి చేసినట్టు అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ ప్రయోగం భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి మార్గం సుగమం చేసిందని వారు చెబుతున్నారు.
ఈ మేరకు న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త క్రిస్టోఫర్ చిబా నేతృత్వంలో అధ్యయనం జరిగింది. అధ్యయనంలో భాగంగా మాంగనీస్ జింక్ ఫెర్రైట్తో తయారు చేసిన 29.9 సెంటీమీటర్ల పొడవైన హ్యాలోవ్ సిలిండర్ను భూ భ్రమణం, అయస్కాంత క్షేత్రానికి 90 డిగ్రీల కోణంలో ఉంచి ప్రయోగం చేశారు. ఇందులో 19 మైక్రోవోల్ట్స్ విద్యుత్తు ఉత్పత్తి అయినట్టు గుర్తించారు.