ఒట్టావా: 1985 నాటి కనిష్క విమానం బాంబు పేలుడు కేసులో దర్యాప్తు ఇంకా క్రియాశీలంగానే ఉన్నదని, కొనసాగుతున్నదని కెనడా పోలీసులు వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన దేశీయ ఉగ్రవాద కేసుల్లో ఇది ఒక ‘దీర్ఘకాలం’గా జరుగుతున్న దర్యాప్తు అని పేర్కొన్నారు.
39 ఏండ్ల క్రితం 1985, జూన్ 23న కెనడాలోని మాంట్రియల్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా ‘కనిష్క’ విమానం 182 లండన్ ఎయిర్పోర్టులో దిగే 45 నిమిషాల ముందు పేలిపోయింది. విమానంలో ఉన్న 329 మంది మరణించారు. 1984లో జరిగిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’కు వ్యతిరేకంగా సిక్కు మిలిటెంట్లు ఈ బాంబు పేలుడుకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.