Prince Andrew | జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం కేసులో పేరు.. యువరాజు ఆండ్రూని ఇంటి నుంచి గెంటేసిన బ్రిటన్ రాజు
Prince Andrew | అమెరికాలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) సెక్స్ కుంభకోణం కేసు సంచలనం రేపుతోంది.
Prince Andrew | అమెరికాలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) సెక్స్ కుంభకోణం కేసు సంచలనం రేపుతోంది. తన పరపతి పెంచుకోవడం కోసం జెఫ్రీ ఏళ్ల తరబడి టీనేజ్ అమ్మాయిలను ఎరగా వేశాడు. ఆయన సన్నిహితుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సహా, మాజీ అధ్యక్షులు, రాజకీయ, వ్యాపార వేత్తలు కూడా ఉన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసు పత్రాల్లో బ్రిటన్ యువరాజు ఆండ్రూ (Prince Andrew) పేరు కూడా బయటకొచ్చింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో సోదరుడిపై బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III (King Charles III) కఠిన చర్యలు తీసుకున్నారు. డ్యూక్ ఆఫ్ యార్క్ సహా అన్ని రాచరిక హక్కులను, గౌరవాలు, అధికారాలను వదులుకోవడంతో పాటు లండన్‌లోని విండ్సర్ ఎస్టేట్‌ను ఖాళీ చేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. రాజు ఆదేశాలతో ఆండ్రూ తూర్పు ఇంగ్లాండ్‌లోని సాండ్రిగ్హోమ్ ప్రైవేటు ఎస్టేట్‌లోకి మారతారని తెలిపింది. తనపై వచ్చిన ఆరోపణలను ఆండ్రూ తిరస్కరించినా.. ఈ చర్యలు నైతికంగా అవసరమైనవేనని రాజు భావిస్తున్నట్లు బకింగ్హమ్ ప్యాలెస్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవహారంలో రాజు చార్లెస్, రాణి కెమిల్లా బాధితులవైపే ఉంటారని స్పష్టం చేసింది.
సెక్స్ కుంభకోణం కేసు అమెరికాను కుదిపేసిన విషయం తెలిసిందే. జెఫ్రీ ఎప్స్టీన్పై అమెరికాలో చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసు నమోదు అయ్యింది. సెక్స్ క్రైంలో దోషిగా తేలిన అతన్ని జైలులో వేశారు. అయితే మన్‌హట్టన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అతను 2019లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎప్స్టీన్ కు సబంధించిన అన్ని అంశాలు బహిర్గతం చేయాలని ఇటీవల అమెరికా న్యాయ శాఖ ఆదేశాలు ఇవ్వడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఇక ఈ కేసులో ఆండ్రూపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే, ఆ ఆరోపణలను అతను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తున్నారు. అమెరికాకు చెందిన వర్జినియా గ్రిఫీ అనే బాధితురాలు ఆండ్రూపై లైంగిక ఆరోపణలు చేసింది.
తనను 2019 లో సెక్స్ కోసం బ్రిటన్ యువరాజు ఆండ్రూకు అప్పుగా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టెయిన్ ఇచ్చాడని తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఫైనాన్షియర్ జెఫ్రీ ఎఫ్స్టెయిన్ 2019 లో న్యూయార్క్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. 20 ఏండ్ల క్రితం తాను 18 ఏండ్ల కన్నా తక్కువ వయసులో ఉన్నప్పుడు లండన్ సోషియల్ జిస్లైన్ మాక్స్వెల్ ఇంట్లో తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఎప్స్టెయిన ఇంటితోపాటు వర్జిన్ దీవుల్లోని లిటిల్ సెయింట్ జేమ్స్ దీవిలో కూడా ఆండ్రూ తనను దుర్భాషలాడారని గిఫ్రే పేర్కొన్నది. అయితే, ఇదంతా అభూతకల్పన అని, ఆమె ఎవరో కూడా తనకు తెలియదని, ఎప్పుడూ కలువలేదని యువరాజు ఆండ్రూ తేల్చిచెప్పారు. ఆమె చేస్తున్న ఆరోపణలతో బ్రిటన్ రాజ కుటుంబం పరువుకు భంగం కలిగిందని ఆయన అన్నారు.
Also Read..
విదేశీ ఉద్యోగులపై ట్రంప్ మరో పిడుగు.. వర్క్ పర్మిట్స్ ఆటో రెన్యువల్ రద్దు
చైనాపై 10 శాతం టారిఫ్ తగ్గింపు : ట్రంప్
కారుపై మూత్ర విసర్జన వద్దన్నందుకు భారతీయుడి హత్య
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

