బ్రసెల్స్: మనుషుల వెంట్రుకలు కాలుష్యాన్ని నివారించగలవని చెబుతున్నది బెల్జియంకు చెందిన డంగ్ డంగ్ అనే సంస్థ. ఈ సంస్థ మానవ వెంట్రుకల రీసైక్లింగ్, వ్యర్థ పదార్థాల పునర్వినియోగం వంటి వాటి కోసం పని చేస్తుంది. ఈ సంస్థ మానవ వెంట్రుకలపై జరిపిన పరిశోధనలో ఆసక్తికర విషయాలను గుర్తించింది. ఒక కిలో వెంట్రుకలు దాదాపు ఏడెనిమిది లీటర్ల ఆయిల్, హైడ్రో కార్బన్లను గ్రహిస్తుందని ఈ సంస్థ గుర్తించింది. వాయు కాలుష్యానికి కారణమవుతున్న ఆయిల్, హైడ్రో కార్బన్లతో పాటు నీటి కాలుష్యానికి కారణమయ్యే ఆయిల్‌ను గ్రహించడం ద్వారా కాలుష్యాన్ని నివారించడంలో వెంట్రుకలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. వెంట్రుకల్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందని, ఎరువుగానూ ఉపయోగించవచ్చని చెబుతున్నారు.