ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్ 50వ ఆవిర్భావ దినోత్సవం, విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన బుధవారం ఢాకా చేరుకున్నారు. మూడు రోజులపాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎకె అబ్దుల్ మోమెన్తో ఆయన సమావేశమవుతారు.
భారత్ సహాయంతో బంగ్లాదేశ్ విముక్తి పొంది 50 ఏండ్లు అయ్యింది. 1971 డిసెంబర్ 16న సుమారు 93,000 మంది పాకిస్తానీ సైనికులు భారత సైన్యం, ‘ముక్తి బాహిని’ సంయుక్త దళాలకు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగే బంగ్లాదేశ్ స్వర్ణోత్సవం, 1971 యుద్ధ విజయోత్సవ వేడుకల్లో భారత గౌరవ అతిథిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొంటారు. భారత త్రివిధ దళాలకు చెందిన 122 మందితో కూడిన కాంటిజెంట్ కూడా ఈ పరేడ్లో భాగస్వామ్యమవుతుంది.
మూడు రోజుల పర్యటనలో బంగ్లాదేశ్ విముక్తి యోధులతోపాటు, భారత మాజీ ఆర్మీ అధికారులతో కూడా రాష్ట్రపతి రామ్నాథ్ సమావేశమవుతారు. గత ఏడాది కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే.
#WATCH | President Ram Nath Kovind meets Bangladesh PM Sheikh Hasina in Dhaka pic.twitter.com/ycARxRzgD7
— ANI (@ANI) December 15, 2021