Malawi | మిస్సైన సైనిక విమానం దట్టమైన అడవిలో కూలిపోయి ఉండొచ్చు : మలావీ మిలటరీ
Malawi | మలావీ ఉపాధ్యక్షుడు 51 ఏళ్ల సౌలోస్ చిలిమా (Saulos Klaus Chilima) ప్రయాణిస్తున్న మిలిటరీ విమానం దట్టమైన అడవిలో కూలిపోయి ఉండొచ్చని (May Have Crashed) మిలటరీ మంగళవారం తెలిపింది.
Malawi | మలావీ ఉపాధ్యక్షుడు 51 ఏళ్ల సౌలోస్ చిలిమా (Saulos Klaus Chilima) ప్రయాణిస్తున్న మిలిటరీ విమానం సోమవారం అదృశ్యమైన విషయం తెలిసిందే. విమానం అదృశ్యమై దాదాపు 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో విమానం దట్టమైన అడవిలో కూలిపోయి ఉండొచ్చని (May Have Crashed) మలావీ మిలటరీ మంగళవారం తెలిపింది. చికన్‌గావా ఫారెస్ట్ చుట్టూ దట్టమైన పొగమంచు వాతావరణం కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడుతోందని సైనిక అధికారి పాల్ వాలెంటినో ఫిరి పేర్కొన్నారు.
చిలిమాతోపాటు మరో తొమ్మిది మందితో సైనిక విమానం సోమవారం ఉదయం 09:17 గంటల సమయంలో రాజధాని నగరం లిలోన్గ్వే నుంచి బయలుదేరింది. ఈ విమానం 10:02 గంటలకు 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో (Mzuzu airport) దిగాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దృశ్యమానత సరిగా లేకపోవడంతో విమానం ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అధికారులు తిరిగి రాజధానికి రావాల్సిందిగా ఆదేశించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాడార్‌తో దీని సంబంధాలు తెగిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విమానం జాడ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
Also Read..
Parliament session | ఈ నెల 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆరోజే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక!
Toll Booth | ట్యాక్స్ చెల్లించమన్నందుకు టోల్ బూత్‌ను బుల్డోజర్తో ధ్వంసం చేసిన డ్రైవర్.. VIDEO
Badrinath | బద్రినాథ్ ధామ్‌కు పోటెత్తుతున్న భక్తులు.. నెలలోపే 5 లక్షల మంది విజిట్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

