శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 02, 2020 , 13:28:56

ఖాత‌రు చేయ‌కుంటే కాల్చిచంపండి: ఫిలీప్పీన్స్ అధ్య‌క్షుడు

ఖాత‌రు చేయ‌కుంటే కాల్చిచంపండి: ఫిలీప్పీన్స్ అధ్య‌క్షుడు

న్యూఢిల్లీ: ప‌్రాణాంత‌క కరోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు భేఖాతరు చేస్తున్న వారిపై ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని ఆయన హెచ్చ‌రించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కాల్చి చంపండి అంటూ పోలీసులు, మిలిటరీ అధికారులను రోడ్రిగో ఆదేశించారు. 

ప్రతి ఒక్కరూ గృహ నిర్బంధంలో ఉండి కరోనా వైరస్ ప్రబలకుండా సహకరించాలని ఫిలీప్పీన్స్ అధ్య‌క్షుడు కోరారు. ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు. అయితే ఖాత‌రు చేయ‌కుంటే కాల్చి చంపండి అన్న రోడ్రిగో ఆదేశాల‌పై మాన‌వ‌హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. నెటిజ‌న్లు సైతం రోడ్రిగో వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా, క‌రోనా తీవ్రత దృష్ట్యా అధ్య‌క్షుడు అలా మాట్లాడార‌ని, పోలీసులు, మిలిట‌రీ వాళ్లు ఎవ‌రినీ షూట్ చేయ‌ర‌ని ఫిలిప్పీన్స్ పోలీస్ చీఫ్ వివ‌ర‌ణ ఇచ్చారు.  


logo