వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్(Pete Hegseth)కు లైన్ క్లియర్ అయ్యింది. సేనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో పీట్ 51 ఓట్ల తేడాతో గట్టెక్కారు. పీట్ హెగ్సేత్ అభ్యర్థిత్వాన్ని డెమోక్రాట్లతో పాటు కొందరు రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అయితే అధ్యక్షుడు ట్రంప్ సమర్థించిన పీట్ చివరకు రక్షణ మంత్రి అయ్యారు. పీట్‌కు వ్యతిరేకంగా 50 ఓట్లు, అనుకూలంగా 50 ఓట్లు పడ్డాయి. టై-బ్రేకర్ కావడంతో.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన కీలకమైన ఓటును పీట్‌కు అనుకూలంగా వేశారు. దీంతో 51 ఓట్ల తేడాతో పీట్ హెగ్సేత్ గెలిచారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ కన్ఫర్మేషన్ పూర్తి అయ్యింది.
పీట్ హెగ్సేత్ గతంలో అమెరికా రక్షణదళంలో పనిచేశారు. ఫాక్స్ న్యూస్ యాంకర్‌గా కూడా ఆయన చేశారు. అయితే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ కూడా జరిగింది. రక్షణ మంత్రిగా ఆమోదం పొందేందుకు .. సేనేట్ విచారణ చేపట్టింది. తనపై ఉన్న అన్ని ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. సేనేట్‌లోని 47 మంది డెమోక్రటిక్ నేతలు పీట్ హెగ్సేత్కు వ్యతిరేకంగా ఓటేశారు. ఆయన్న ఓడించాలంఏట మరో నలుగురు రిపబ్లికన్లు అవసరం వచ్చింది. అయితే ముగ్గరు మాజీ సీనియర్ రిపబ్లికన్ నేతలు పీట్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. కానీ టై కావడంతో.. ఉపాధ్యక్షుడు వాన్స్ తన ఓటును పీట్‌కు ఫేవర్‌గా వేశారు.
44 ఏళ్ల పీట్ హెగ్సేత్ గతంలో అమెరికా మిలిటరీలో చేశారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ఫాక్స్ ఛానల్లో హోస్ట్‌గా పనిచేశారు. వాస్తవానికి క్యాబినెట్ హోదా దక్కాలంటే.. ఆ హోదాలో పనిచేసే వారు సాధారణంగా సీనియర్ సివిల్ సర్వెంట్ లేదా అనుభవం ఉన్న రాజకీయవేత్త లేదా జనరల్స్, ఎగ్జిక్యూటివ్‌లు ఉంటారు. కానీ చిన్నవయసులోనే అమెరికా రక్షణమంత్రిగా పీట్ నియమితుడయ్యారు.
2017లో కాలిఫోర్నియాలోని ఓ హోటల్‌పై మహిళను లైంగికంగా వేధించినట్లు పీట్పై ఆరోపణలు ఉన్నాయి. పెద్ద తాగుబోతు అని కూడా అతనికి చెడ్డ పేరు ఉంది. గతంలో రెండు సార్లు పెళ్లి చేసుకున్నా.. ఆ భాగస్వాములతో నమ్మశక్యంగా లేడని కూడా ఆరోపణలు ఉన్నాయి.