ట్విట్టర్ సీఈవోను తొలగించిన మస్క్.. పరాగ్ అన్ని కోట్లు అందుకోనున్నారా..?
Elon Musk|ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ను(Twitter) హస్తగతం చేసుకున్నారు. 44 బిలియన్ యూఎస్ డాలర్లతో తన చేతిలోకి తీసుకున్నారు. మన కరెన్సీలో ఈ మొత్తం ఒప్పందం విలువ సుమారు రూ.3.37 లక్షల కోట్లు. ఈ ఒప్పందం తర్వాత 2013 నుంచి పబ్లిక్ కంపెనీగా ఉన్న ట్విట్టర్, ఒక ప్రైవేట్ కంపెనీగా మారిపోయింది. కాగా, ట్విట్టర్‌ను మస్క్ హస్తగతం చేసుకున్న గంటల వ్యవధిలోనే సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నెడ్ సెగల్‌ను తొలగించారు.
Elon Musk | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ను(Twitter) హస్తగతం చేసుకున్నారు. 44 బిలియన్ యూఎస్ డాలర్లతో తన చేతిలోకి తీసుకున్నారు. మన కరెన్సీలో ఈ మొత్తం ఒప్పందం విలువ సుమారు రూ.3.37 లక్షల కోట్లు. ఈ ఒప్పందం తర్వాత 2013 నుంచి పబ్లిక్ కంపెనీగా ఉన్న ట్విట్టర్, ఒక ప్రైవేట్ కంపెనీగా మారిపోయింది. కాగా, ట్విట్టర్‌ను మస్క్ హస్తగతం చేసుకున్న గంటల వ్యవధిలోనే సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నెడ్ సెగల్‌ను తొలగించారు. కాగా, ట్విట్టర్ తన చేతికి వచ్చిన తర్వాత ఉద్యోగులను భారీగా తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై మస్క్ ఇప్పటికే స్పందించారు. 75 శాతం ఉద్యోగులను తాను తొలగించబోనని స్పష్టం చేశారు.
అయితే, పరాగ్ అగర్వాల్‌ను సీఈవో పదవి నుంచి తప్పిస్తే.. కంపెనీ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. సీఈఓగా నియమితులైన తర్వాత 12 నెలల్లోపు పరాగ్‌ను పదవి నుంచి తొలగిస్తే.. ఇందుకు 42 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.321 కోట్లు అన్నమాట.
ట్విట్టర్‌కు మస్క్ ప్రకటించిన ఆఫర్ ధర ఒక్కో షేరుకు 54.20 డాలర్లుగా ఉంది. దీనికి తోడు కంపెనీకి సంబంధించిన ప్రాక్సీ స్టేట్మెంట్లోని నిబంధనలను ఆధారంగా సీఈఓకు చెల్లించే పరిహారం మొత్తం 42 మిలియన్ డాల్లరు ఉండవచ్చని రాయిటర్స్ అంచనా వేసింది. కాగా, పరాగ్ 2021 నవంబర్‌లో జాక్ డోర్సీ నుంచి ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

