Bhagat Singh | లాహోర్: బ్రిటిష్ వలస పాలకులపై వీరోచితంగా పోరాడి, ప్రాణ త్యాగం చేసిన భగత్ సింగ్ పట్ల పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం దురహంకారంతో వ్యవహరించింది. ఆయనను గౌరవించేందుకు తిరస్కరించింది. షడ్మన్ చౌక్‌కు భగత్ సింగ్ పేరు పెట్టడాన్ని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించింది.
భగత్ సింగ్‌ను ఉగ్రవాదిగా పేర్కొనడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఘాటుగా స్పందించింది. దీనిపై పాకిస్థాన్‌ను వివరణ కోరాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బీజేపీ స్పందిస్తూ, పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న విషయం అందరికీ తెలుసునని పేర్కొంది. భగత్ సింగ్‌ను అపఖ్యాతిపాలు చేయడం కోసం పాకిస్థాన్ నయవంచనకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది.