లాహోర్: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్ ఆవరణలో కర్తార్‌పూర్ ప్రాజెక్టు మేనేజ్మెంట్( Kartarpur) శనివారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఆ ఈవెంట్లో డ్యాన్స్ పార్టీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మద్యంతో పాటు మాంసాన్ని కూడా సర్వ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే గురుద్వారా ఆవరణలో మద్యం, మటన్‌ను సర్వ్ చేయడానికి సిక్కులు వ్యతిరేకిస్తున్నారు. నవంబర్ 18వ తేదీన జరిగిన సమావేశంలో ఎటువంటి డ్యాన్స్ పార్టీ కానీ, మద్యం సరఫరా కానీ జరగలేదని కర్తార్‌పూర్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ పేర్కొన్నది. వైరల్ అవుతున్న వీడియో నిజం కాదు అని, మద్యం తాగుతున్న దృశ్యాలను వీడియో మార్ఫింగ్ చేశారని నిర్వాహకులు ఆరోపించారు. గురుద్వారా పీఎంయూ కాంప్లెక్స్‌కు రెండు కిలోమీటర్ల దూరం డిన్నర్ పార్టీ జరిగిందని అధికారులు చెప్పారు.
Debauchery at #Kartarpur Corridor
A barbeque of assorted non-vegetarian items & dance party was organized by Sayed Abu Bakar Qureshi, CEO PMU Kartarpur Corridor in the Gurdwara Shri Darbar Sahib complex on November 18th, attended by Mohmmad Sharukh, Deputy Commissioner Narowal. pic.twitter.com/8g6SxYRt46
— Navdeep Singh (@Navdeep_UK) November 20, 2023