పాకిస్థాన్ బుద్ధి మారలేదు.. ఐక్యరాజ్య సమితిలో దాయాదిపై విరుచుకుపడ్డ భారత్

న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి దాయాది పాకిస్థాన్ దుర్బుద్ధిని ఎండగట్టింది భారత్. ఈ విశ్వ వేదికను ఇండియాపై విద్వేషాన్ని ప్రదర్శించడానికి పాక్ పదేపదే ఉపయోగించుకోవడంపై తీవ్రంగా మండిపడింది. తన ఇంట్లో, సరిహద్దుల్లో హింసా సంస్కృతిని కొనసాగిస్తున్న పాకిస్థాన్.. ఇలాంటి వేదికలపై మాత్రం శాంతి వచనాలు వల్లె వేస్తోందని ఐక్యరాజ్య సమితిలో ఇండియా ప్రతినిధి విదిశా మైత్రా చాలా ఘాటుగా సమాధానమిచ్చారు.
యూఎన్‌లో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ జమ్ముకశ్మీర్ అంశాన్ని, వేర్పాటువాద నేత సయ్యద్ గీలానీల గురించి ప్రస్తావించడంపై భారత్ ఇలా తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వేదికలపై శాంతి మంత్రాలు పటించడం కాదు. అంతర్జాతీయ సంబంధాలు, సభ్య దేశాల మధ్య ఆ శాంతిని నెలకొల్పాలి అని పాకిస్థాన్‌కు సూచించారు విదిశా మైత్రా. ఇండియాపై విద్వేషాన్ని ప్రదర్శించడానికి మరోసారి యూఎన్ వేదికను పాకిస్థాన్ ఎలా వాడుకుందో మనం చూశాం. కానీ ఆ దేశం మాత్రం ఇప్పటికీ తన ఇంట్లో, తన సరిహద్దుల వెంబడి హింసా సంస్కృతిని కొనసాగిస్తోంది. పాక్ చేస్తున్న ఇలాంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని విదిశా అన్నారు.
ఇలాంటి చర్యలను సమర్థించుకోవడానికి మతాన్ని వాడుకుంటున్న ఉగ్రవాదులను, వాళ్లకు మద్దతిస్తున్న వాళ్లను చూసి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. ఇండియా ఇక మీదట కూడా మానవత్వం, ప్రజాస్వామ్యం, అహింసను ప్రోత్సహిస్తుందని ఆమె అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

