Pakistan President | తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాక్.. జీతం తీసుకోరాదని అధ్యక్షుడు జర్దారీ నిర్ణయం..!
Pakistan President | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు (Pakistan President) అసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) ఓ త్యాగానికి సిద్ధపడ్డారు.
Pakistan President | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు (Pakistan President) అసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) ఓ త్యాగానికి సిద్ధపడ్డారు. ఈ పదవీ కాలంలో జీతం (salary) తీసుకోకూడదని నిర్ణయించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది.
‘దేశానికి సహాయం చేయడానికి అధ్యక్షుడు జర్దారీ తన పదవీ కాలంలో ఎలాంటి జీతం తీసుకోరు. ఆర్థిక నిర్వహణ, జాతీయ ఆదాయంపై తన జీతం భారం పడకూడదన్న ఉద్దేశంతోనే అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. తన వేతనాన్ని వదులుకున్నారు’ అని తెలిపింది. అదేవిధంగా పాక్ ఇంటీరియర్ మంత్రి మొహసిన్ నక్వీ (Mohsin Naqvi) కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి పదవీకాలంలో జీతాన్ని తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇది సవాళ్లతో కూడిన సమయమని, వీలైనన్ని మార్గాల్లో దేశానికి అండగా ఉండి సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే తన జీతాన్ని వదులుకుంటున్నట్లు వెల్లడించారు.
పాకిస్థాన్ 14వ అధ్యక్షుడి (14th president of Pakistan)గా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో జర్దారీ విజయం సాధించారు. పీపీపీ, పీఎంఎల్-ఎన్ మద్దతుతో పోటీ చేసిన ఆయన సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ అభ్యర్థి మహమూద్ ఖాన్ అచక్జాయ్ (75)ను ఓడించారు. ఈ ఎన్నికల్లో జర్దారీకి 255 ఓట్లు, మహమూద్‌కు 119 ఓట్లు లభించాయి. దీంతో తదుపరి పాక్ అధ్యక్షుడిగా జర్దారీ బాధ్యతలు చేపట్టారు. ఇస్లామాబాద్ (Islamabad)లోని అధ్యక్ష భవనంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన దేశాధ్యక్ష పదవిని చేపట్టారు.
Also Read..
Uniform Civil Code Bill | ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
Baraat | కారు టాప్‌పై నిల్చొని పెళ్లి మండపానికి వరుడు.. షాకిచ్చిన పోలీసులు
Mallikarjun Kharge | ఇప్పుడు నాకు 83 ఏళ్లు.. అందుకే ఈ నిర్ణయం : మల్లికార్జున ఖర్గే
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

