Baraat | పెళ్లి (wedding) అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది బరాత్ (Baraat) అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాండ్ మేళం, డప్పు చప్పుళ్ల మధ్య చుట్టాలతోపాటు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకుంటుంటారు. సాధారణంగా బరాత్‌లో వధూవరులు అందంగా అలంకరించిన కారు లేదా, బుల్లెట్ బైక్‌పై ఎంట్రీ ఇస్తుండటం మనం చూశాం. కొందరైతే గుర్రాలపై ఎంతో హుందాగా వస్తుంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వరుడు (UP Groom) మాత్రం ఎవరూ ఊహించని విధంగా కారు టాప్‌పై విగ్రహం నిల్చొని పెళ్లి మండపానికి బయల్దేరాడు (Statue Standing On A Car).
షహరాన్‌పూర్‌లోని భైలా గ్రామానికి చెందిన అంకిత్ అనే వ్యక్తికి మీరట్‌లోని కుషావలీ గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. వీరి వివాహ తంతుకు వధువు ఇంటి వద్ద ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అంకిత్ తన గ్రామం నుంచి పెళ్లి మండపానికి కారులో బయల్దేరాడు. అయితే, అంతా వెళ్లేలా కారు లోపల కూర్చోకుండా.. టాప్ పైకి ఎక్కి విగ్రహంలా నిల్చొని ఊరేగింపుగా బయల్దేరాడు. ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై అతని ఫొటోలు తీసేందుకు డ్రోన్‌ను కూడా ఉపయోగించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
మరోవైపు విషయం తెలుసుకున్న మన్సూర్పూర్ పోలీసులు వరుడికి షాకిచ్చారు. ఎన్‌హెచ్-58లో వరుడి బరాత్‌ను అడ్డుకున్నారు. ఊరేగింపుకు ఉపయోగించిన ఎస్యూవీ వాహనాన్ని సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఖతౌలీ సర్కిల్ ఆఫీసర్ యతేంద్ర సింగ్ నగర్ తెలిపారు. వరుడు వివాహ వేదిక వద్దకు మరో కారులో వెళ్లేందుకు అనుమతించినట్లు చెప్పారు.
Also Read..
Mallikarjun Kharge | ఇప్పుడు నాకు 83 ఏళ్లు.. అందుకే ఈ నిర్ణయం : మల్లికార్జున ఖర్గే
Rameshwaram Cafe | రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు.. ఎన్ఐఏ అదుపులో ప్రధాన నిందితుడు
Water Crisis | నెలకు ఐదు సార్లే స్నానం.. వంట వండుకోకుండా ఫుడ్ ఆర్డర్.. బెంగళూరు ప్రజల నీటి కష్టాలు