Asif Ali Zardari | పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ
Asif Ali Zardari | పాకిస్థాన్ దేశానికి 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) సహ వ్యవస్థాపకుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. జర్దారీ పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఎంపిక కావడం ఇది రెండోసారి. పీపీపీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) సంయుక్తంగా పాకిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అధికార కూటమి తరఫున 68 ఏళ్ల ఆసిఫ్ అలీ జర్దారీ అధ్యక్ష పదవికి బరిలో నిలిచారు.
Asif Ali Zardari: పాకిస్థాన్ దేశానికి 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) సహ వ్యవస్థాపకుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. జర్దారీ పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఎంపిక కావడం ఇది రెండోసారి. పీపీపీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) సంయుక్తంగా పాకిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అధికార కూటమి తరఫున 68 ఏళ్ల ఆసిఫ్ అలీ జర్దారీ అధ్యక్ష పదవికి బరిలో నిలిచారు.
జర్దారీ ప్రత్యర్థిగా సున్నీ ఇత్తేహద్ కౌన్సిల్ పార్టీకి చెందిన 75 ఏళ్ల మహ్మద్ ఖాన్ అచక్జాయ్ అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఓటింగ్‌లో ఆసిఫ్ అలీ జర్దారీకి 255 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి మహ్మద్ ఖాన్‌కు 119 ఓట్లు పడ్డాయి. వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జర్దారీ పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో భర్త. పాకిస్థాన్ 13వ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ పదవీకాలం గత ఏడాదితో ముగియడంతో నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.
జర్దారీ గతంలో 2008 నుంచి 2013 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావడంతో అధ్యక్ష ఎన్నికలు ఆలస్యమయ్యాయి. న్యూ ఎలక్టోరల్ కాలేజీ ఏర్పాటైన తర్వాత కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

