పాక్ అధికారుల విదేశీ బాట!
పాకిస్థాన్‌కు చెందిన ఉన్నతాధికారులు శాశ్వతంగా విదేశాలకు తరలివెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నారని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆరోపించారు. ప్రస్తుతం ఉన్నత పదవుల్లో ఉన్న కొందరు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. కెనడా, యూఎస్, యూకే, ఐరోపా, పోర్చుగల్ దేశాల్లో వారు ఇండ్లను, శాశ్వత నివాస ఏర్పాట్లను సమకూర్చుకుంటున్నారన్నారు.
- మంత్రి ఖ్వాజీ ఆసిఫ్ ఆరోపణ
ఇస్లామాబాద్, అక్టోబర్ 21: పాకిస్థాన్‌కు చెందిన ఉన్నతాధికారులు శాశ్వతంగా విదేశాలకు తరలివెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నారని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆరోపించారు. ప్రస్తుతం ఉన్నత పదవుల్లో ఉన్న కొందరు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. కెనడా, యూఎస్, యూకే, ఐరోపా, పోర్చుగల్ దేశాల్లో వారు ఇండ్లను, శాశ్వత నివాస ఏర్పాట్లను సమకూర్చుకుంటున్నారన్నారు.
ఇంకా సర్వీస్ ఉండి దేశానికి సేవలందించగలిగే అవకాశం ఉన్నప్పటికీ వీరు విదేశాలకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారని ఆయన వారి విశ్వసనీయతను ప్రశ్నించారు. వారి చర్యలు దేశం పట్ల వారికున్న అంకితభావం, వారి పదవీ కాలంలో నిర్వహించిన పాత్ర గురించి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. అయితే విదేశాలకు వెళ్లే యోచనలో ఉన్న అధికారుల పేర్లను ఆయన వెల్లడించ లేదు. అధికారులకు విదేశాల్లో శాశ్వత నివాసం ఇప్పించేందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన ఒక వ్యక్తి పెద్దమొత్తం డబ్బు తీసుకుని అదృశ్యమయ్యాడని ఆయన తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

