Pakistan ISI: తాలిబన్ల విజయంలో పాకిస్థాన్, ఐఎస్ఐదే కీలకపాత్ర: అమెరికా రిపబ్లికన్ నేత
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల విజయం వెనుక కీలకపాత్ర పోషించింది పాకిస్థాన్, అక్కడి ఇంటెలిజెన్స్ సర్వీస్ ( Pakistan ISI ) అని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి, రిపబ్లికన్ నేత స్టీవ్ చాబోట్ ఆరోపించారు. తాలిబన్ల విజయాన్ని పాకిస్థాన్ సెలబ్రేట్ చేసుకోవడం అసహ్యంగా ఉన్నదని ఆయన అన్నారు.

వాషింగ్టన్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల విజయం వెనుక కీలకపాత్ర పోషించింది పాకిస్థాన్, అక్కడి ఇంటెలిజెన్స్ సర్వీస్ ( Pakistan ISI ) అని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి, రిపబ్లికన్ నేత స్టీవ్ చాబోట్ ఆరోపించారు. తాలిబన్ల విజయాన్ని పాకిస్థాన్ సెలబ్రేట్ చేసుకోవడం అసహ్యంగా ఉన్నదని ఆయన అన్నారు. ఆదివారం హిందూ పొలిటికల్ యాక్షన్ కమిటీ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న స్టీవ్.. ఆఫ్ఘన్లను అక్కున చేర్చుకుంటున్న భారత ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అదే సమయంలో పాకిస్థాన్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ముఖ్యంగా వాళ్ల ఇంటెలిజెన్స్ సర్వీసెస్ తాలిబన్ల వెనుక కీలకపాత్ర పోషించాయి. పాకిస్థాన్ అధికారులు ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే అసహ్యమేస్తోంది అని స్టీవ్ చాబోట్ అన్నారు.
నిజానికి పాకిస్థాన్‌లో మతపరమైన మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాల గురించి అమెరికాలో పెద్దగా చర్చ జరగడం లేదు. దీనిపై అమెరికా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. హిందువుల కిడ్నాపింగ్, బలవంతపు మత మార్పిడి, హిందు బాలికలను ముస్లిం వృద్ధులకు ఇచ్చి పెళ్లిళ్లు చేయడం వంటి దారుణాలు పాకిస్థాన్‌లో జరుగుతున్నాయి అని స్టీవ్ అన్నారు. అమెరికాలో 60 లక్షల మంది హిందువులు ఉన్నారని, వాళ్లంతా అమెరికా సమాజంలో ఓ అంతర్గత భాగమని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- afghanistan
- America
- Kabul
- Pakistan
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

