US Census | గతేడాదితో పోలిస్తే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న జనాభా పెరిగింది. ఇటీవల అమెరికా విడుదల చేసిన జన గణన నివేదిక ప్రకారం చట్ట బద్ధంగానూ, అక్రమంగా వలస వచ్చిన వారు.. అమెరికా జనాభాలో 13.9 శాతం ఎక్కువ. 2022 జూలైతో పోలిస్తే అమెరికా జనాభా 33 కోట్ల పై చిలుకే. అమెరికాలో జన్మిస్తున్న ఏడుగురిలో ఒకరు విదేశీ సంతతి వారేనని ఆ నివేదిక పేర్కొంది.
2022 ఇమ్మిగ్రేషన్ గణాంకాల ప్రకారం అమెరికాలో జీవిస్తున్న ఇమ్మిగ్రేంట్స్లో భారతీయులు, చైనీయులు ఆరు శాతం చొప్పున ఉంటారు. 2021తో పోలిస్తే 2022లో అమెరికాలో జీవిస్తున్న భారతీయులు 27.09 లక్షల నుంచి 28.4 లక్షల మందికి చేరారు. 2021తో పోలిస్తే 4.8 శాతం భారతీయులు పెరిగారు. ఇక చైనా నుంచి అమెరికాకు వలస వచ్చిన వారు 28.3 లక్షల మంది ఉంటారు. 2021తో పోలిస్తే 79 వేల మంది ఎక్కువయ్యారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2022లో సుమారు మూడు శాతం పెరిగారు.
అన్ని దేశాల కంటే అమెరికాలో జీవిస్తున్న వలస కార్మికుల్లో మెక్సికన్లే. మొత్తం అమెరికా జనాభాలో మెక్సికన్లు 106.8 లక్షలు. (ఇమ్మిగ్రెంట్స్ జనాభాలో 23 శాతం). అయితే, 2021తో పోలిస్తే ఒకశాతం లోపు ఇమ్మిగ్రెంట్స్ తగ్గిపోయారు. ఇక అమెరికా మొత్తం జనాభా 2021తో పోలిస్తే కేవలం 13.6 శాతం నుంచి 13.9 శాతానికి మాత్రమే పరిగింది. 2012లో అమెరికా జనాభాలో ఇమ్మిగ్రెంట్స్ 13.1 శాతం.. కానీ ఇప్పుడు 0.7 శాతం పెరిగినా.. 1990వ దశకంతో పోలిస్తే 76 శాతం తగ్గిపోయారు.
మెక్సికో, భారత్, చైనాతో పోలిస్తే ఆఫ్ఘనిస్థాన్లు, వెనిజులా వాసుల జనాభా అతి తక్కువ. ఆప్ఘనిస్థాన్లు 4.07 లక్షలు, వెనిజులా వాసులు 6.7 లక్షల మంది ఉంటారు. వారిలో చాలా మంది ఆశ్రయం కోరి వచ్చిన వారు, శరణార్థులు ఉంటారు. 2021 నుంచి 2022 నాటికి రెండు దేశాల నుంచి ఆశ్రయం కోరి వచ్చిన వారు, శరణార్థులుగా వచ్చిన వారు 229, 22 శాతం చొప్పున పెరిగారు.