ఒమిక్రాన్ లైఫ్.. చర్మంపై 21 గంటలు.. ప్లాస్టిక్‌పై 8 రోజులు

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ఎందుకు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందో ఓ క్లారిటీ వచ్చింది. ఆ వేరియంట్ మానవ చర్మంపై 21 గంటల పాటు సజీవంగా ఉంటోంది. అంతేకాదు ఇక ప్లాస్టిక్‌పై ఆ వేరియంట్ లైఫ్ 8 రోజులని ఓ స్టడీ తేల్చింది. జపాన్‌కు చెందిన క్యోటో యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. వుహాన్‌లో పుట్టిన సార్స్ సీఓవీ2 ఒరిజినల్ వేరియంట్‌తో పాటు ఇతర వేరియంట్లపై నిర్వహించిన స్టడీ ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు.. ఒరిజినల్‌తో పోలిస్తే రెండు రెట్లు అధిక లైఫ్ ఉన్నట్లు గుర్తించారు. ప్రతికూల వాతావరణంలోనూ వ్యాప్తి ఎలా ఉంటుందన్న కోణంలో అధ్యయనం చేపట్టారు. అయితే దాంట్లో ఒమిక్రాన్ వేరియంట్‌కే ఎక్కువ సామర్ద్యం ఉన్నట్లు తేలింది. అందువల్లే అది డెల్లా వేరియంట్‌ను కూడా దాటి వేసినట్లు పరిశోధకులు చెబుతున్నారు.
ప్లాస్టిక్ సర్ఫేస్‌లపై ఒరిజినల్ వేరియంట్ 56 గంటలు, ఆల్ఫా 191.3, బీటా 156.6, గామా, 59.3, డెల్టా వేరియంట్ 114 గంటలు ఉన్నట్లు తేలింది. అయితే పరిశోధకులు మాత్రం ఒమిక్రాన్ వేరియంట్ .. ప్లాస్టిక్‌పై 193.5 గంటల పాటు సజీవంగా ఉండనున్నట్లు తెలిపారు. చర్మంపై ఉన్న వివిధ వేరియంట్ శ్యాంపిళ్లను కూడా స్టడీ చేశారు. ఒరిజినల్ వైరస్ చర్మంపై 8.6 గంటలు సజీవంగా ఉంటుంది. ఆల్ఫా 19.6 గంటలు, బీటా 19.1 గంటలు, గామా 11 గంటలు, డెల్టా 16.8 గంటలు, డెల్టా వేరియంట్ 21.1 గంటలు చర్మంపై సజీవంగా ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

