Omicron effect on UK | కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్‌తో వచ్చే ఏప్రిల్‌కల్లా బ్రిటన్‌లో 25 వేల నుంచి 75 వేల మంది మరణించే అవకాశం ఉందని ఓ అధ్యయనం పేర్కొంది. ఒమిక్రాన్ కట్టడి చేయడానికి అదనపు భద్రతా చర్యలు చేపట్టాల్సిన లేనిపక్షంలో 75 వేల మంది మరణిస్తారని లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. గత జనవరి కంటే ఎక్కువ మంది హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ నివేదిక హెచ్చరించింది. పౌరుల్లో ఉన్న రోగ నిరోధక శక్తిని అధిగమించి ఈ ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తుందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
రోజువారీ హాస్పిటలైజ్ అవుతున్న వారి సంఖ్య రెండు వేలు దాటుతుందని అంచనా. ఒమిక్రాన్ కట్టడికి అదనపు చర్యలు చేపట్టకపోతే ఈ నెల ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకు 1.75 లక్షల మంది దవాఖానల్లో చేరతారని, 24,700 మంది మృత్యువాత పడతారని ఈ అధ్యయన నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.