త్వరలో మళ్లీ కరోనా ఆంక్షలు విధించకోపోతే యూకేలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు శనివారం హెచ్చరించారు.
ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, ఇన్ఫెక్షన్ల రేటు చాలా ఎక్కవగా ఉండటంతో ఆస్పత్రులలో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశోధకులలో ఒకరైన డాక్టర్ నిక్ డేవీస్ అన్నారు.
యూకేలో శనివారం తాజాగా 633 కొత్త ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆ దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,898కు చేరింది. ఇంగ్లాండ్లో సగటున కేసుల సంఖ్య ప్రతి 2.4 రోజులకు రెట్టింపు అవుతోంది.
యూకే ప్రభుత్వం శుక్రవారం నుంచి సినిమా హాళ్లు, ప్రార్థనా స్థలాలు, మ్యూజియంలు, క్రీడా స్టేడియంలలో మాస్కులు ధరించడం తప్పనిసరి అని ఆంక్షలు విధించింది.