ప్రపంచాన్ని భయపెడుతున్న ‘ఒమిక్రాన్’ వేరియంట్‌పై సౌతాఫ్రికా శాస్త్రవేత్తలు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యం వేగంగా వ్యాపిస్తున్న వేరియంట్‌గా డెల్టా ఉన్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ ఈ స్థానాన్ని ఆక్రమించే ప్రమాదం ఉందని, డెల్టాను దాటేసే అవకాశం ఉందని దక్షిణాఫ్రికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్ఐసీడీ) పరిశోధకులు చెప్పారు.
ఎన్ఐసీడీకి చెందిన ఆడ్రియన్ పురెన్ మాట్లాడుతూ.. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వేరియంట్‌గా డెల్టా స్థానాన్ని ఒమిక్రాన్ ఆక్రమించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వ్యాక్సిన్ ఇమ్యూనిటీని ఒమిక్రాన్ వేరియంట్ ఏ రేంజ్లో తప్పించుకోగలుగుతుంది? అనే విషయాన్ని నాలుగు వారాల్లోగా తెలుసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.