North Korea : హజ్మత్ సూట్‌తో ఉత్తర కొరియా సైన్యం పరేడ్
North Korea : ఉత్తర కొరియా (North Korea) 73 వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ సైన్యం కొంగొత్తగా పరేడ్ నిర్వహించింది. గతంలో మాదిరిగా ఆర్బాటాలకు పోకుండా.. ఆయుధ సంపత్తిని బహిరంగపర్చకుండా.. కేవలం...

సియోల్ : ఉత్తర కొరియా (North Korea) 73 వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ సైన్యం కొంగొత్తగా పరేడ్ నిర్వహించింది. గతంలో మాదిరిగా ఆర్బాటాలకు పోకుండా.. ఆయుధ సంపత్తిని బహిరంగపర్చకుండా.. కేవలం హజ్మత్ సూట్లో సైన్యం రాత్రి పూట పరేడ్ చేయడం ఆశ్చర్యం గొలుపుతున్నది. ఈ విషయాలను అక్కడి మీడియా కథనాలను ప్రచురించాయి. ఆరేంజ్ రంగులో హజ్మత్ సూట్లో పరేడ్ చేస్తున్న ఉత్తర కొరియా సైన్యం ఫొటోలను ప్రముఖంగా ప్రచురించాయి. ఎలాంటి క్షిపణులనుగానీ, ఇతర సాంకేతిక పరికరాలనుగానీ ప్రదర్శించలేదని మీడియా నివేదించింది.
ప్యాంగ్యాంగ్లోని కిమ్ II సంగ్ స్క్వేర్‌లోని బుధవారం అర్ధరాత్రి నిర్వహించిన ఈ ఉత్సవాలకు దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ హాజరై సైన్యం పరేడ్‌ను తిలకించినట్లు కేసీఎన్ఏ వార్తా సంస్థ తెలిపింది. ఆరేంజి రంగు హజ్మత్ సూట్లను ధరించి కవాతు చేస్తున్న సైన్యం ఫొటోలను అధికార వర్కర్స్ పార్టీ పత్రిక రోడాంగ్ సిన్మున్ ప్రచురించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పకడ్బంధీగా చర్యలు కూడా తీసుకున్నారు. ఉత్సవాలకు హాజరైన అధికారులతోపాటు ప్రజలు కూడా మెడికల్ గ్రేడ్ మాస్కులు ధరించారు. అయితే, మల్టిపుల్ రాకెట్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ వంటి కొన్ని సంప్రదాయ ఆయుధాలను మాత్రం ఈ సందర్భంగా ప్రదర్శనకు ఉంచారు. బాలిస్టిక్ క్షిపణులను మాత్రం ప్రదర్శించలేదు. అలాగే, కిమ్ కూడా సైన్యాన్ని ఉద్దేశించి ఎలాంటి ప్రసంగం చేయలేదని తెలుస్తున్నది.
1950-53 కొరియన్ యుద్ధంలో ఉత్తర కొరియా కోసం పోరాడిన చైనా దళాలు నిష్క్రమించిన అనంతరం.. రిజర్వ్ ఫోర్సెస్‌గా ప్రారంభించిన 57 లక్షల వర్కర్ పీసెంట్ రెడ్ గార్డ్స్‌ను ఏర్పాటు చేసింది. 2013 తర్వాత ఇలాంటి కవాతు నిర్వహించడం ఇదే మొదటిసారి.
ఇవి కూడా చదవండి..
10 ఏండ్లలో 25 మందితో పరారీ.. అయినా కోపం లేదంటున్న భర్త!
వారణాసి జ్ఞాన్వాపి మసీదు సర్వేపై స్టే
జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్న రాహుల్‌గాంధీ
ఆఫ్ఘన్ గడ్డ నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించం : ఎస్ జైశంకర్
బాలీవుడ్ నటికి పాకిస్తాన్ కోర్ట్ అరెస్ట్ వారెంట్.. ఎందుకంటే?
జపాన్ యువతలో బుస కొడుతున్న హికికొమోరి
పుటుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

