North Korea: ఉత్తర కొరియా మిస్సైల్ పరీక్ష.. జపాన్‌లో గందరగోళం
North Korea: నార్త్ కొరియా మిస్సైల్ పరీక్ష.. జపాన్‌లో గందరగోళాన్ని సృష్టించింది. ఆ మిస్సైల్ ఎక్కడ తమ మీద పడుతుందో అన్న అనుమానాంతో.. హూక్కైడో ప్రాంతంలో ప్రజలను ఇండ్లు ఖాళీ చేయించారు. అయితే మళ్లీ అరగంట తేడాలో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు.
టోక్యో: ఉత్తర కొరియా(North Korea) నిర్వహిస్తున్న మిస్సైల్ పరీక్ష(Missile Test)లతో జపాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇవాళ ఉదయం కూడా జపాన్‌లోని హొక్కైడో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఉత్తర కొరియా క్షిపణిని పరీక్షించినట్లు వార్తలు రావడంతో.. ఉత్తర జపాన్(Japan)లో గందరగోళం ఏర్పడింది. తక్షణమే ఇండ్లను ఖాళీ చేయాలని ప్రజలను ఆదేశించారు. ఆ ప్రాంతంలో సరైన్లు మోగాయి. అయితే 30 నిమిషాల తర్వాత ఆ దేశాలను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది.
ఉత్తర కొరియా పరీక్షించిన మిస్సైల్.. హోక్కైడో దీవి వద్ద పడలేదని, అందుకే అలర్ట్‌ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. నార్త్ కొరియా ఈ ఏడాది ఇప్పటికే 27 మిస్సైళ్లను పరీక్షించింది. దీంతో ఆ ప్రాంతలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. గురువారం ఉత్తర కొరియా ఏ రకమైన ఆయుధాన్ని పరీక్షించిందో ఇంకా తెలియదు. కానీ మీడియం లేదా లాంగ్ రేంజ్ మిస్సైల్‌ను పరీక్షించినట్లు భావిస్తున్నారు.
జపాన్, దక్షిణ కొరియా, అమెరికా దేశాలు ఆ పరీక్షను ఖండించాయి. తమ ప్రభుత్వం జాతీయ సెక్యూర్టీ కౌన్సిల్ మీటింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా తెలిపారు. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతంలోని సముద్ర జలాల్లో మిస్సైల్ కూలినట్లు జపాన్ కోస్టు గార్డులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

