కిలో అరటి పండ్లు రూ.3,300
- కాఫీ పొడి ప్యాకెట్ రూ.7,500
- ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం
- ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు
- సంక్షోభాన్ని తీవ్రం చేసిన కరోనా, తుఫాన్లు

సియోల్, జూన్ 21: అరటి పండ్లు ఒక్క కిలోకు 3,300 రూపాయలు. కాఫీ పొడి ప్యాకెట్ 7,500 రూపాయలు. ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభానికి, మండిపోతున్న ధరలకు ఈ రేట్లే తార్కాణాలు. ఉత్తర కొరియాలో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగి ఆకాశాన్నంటాయి. ధరల పెరుగుదలపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆహార ఉత్పత్తి ప్రణాళికలు విఫలం అయ్యాయని స్వయంగా అంగీకరించారు. గతేడాది సంభవించిన తుఫాను, కరోనా కారణంగా నార్త్ కొరియాలో ఆహార ఉత్పత్తి దెబ్బతిన్నది. ఆహార సంక్షోభాన్ని నివారించడానికి వెంటనే చర్యలు చేపట్టాలని కిమ్ అధికారులను ఆదేశించారు.
ఆహార సంక్షోభం కొత్తేమీ కాదు

ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం కొత్తేమీ కాదు. ఉత్తర కొరియా తమ ఆహార అవసరాలకు ఎక్కువగా చైనాపై ఆధారపడుతుంది. ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం ఉత్తర కొరియాలో 8.60 లక్షల టన్నుల ఆహార కొరత ఉంది. ఆహారం కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్న 40 దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. ఈ పరిస్థితిని కరోనా, తుఫాన్లు తీవ్రం చేశాయి. కరోనా కారణంగా దిగుమతులు నిలిచిపోయాయి. అదే సమయంలో తుఫానుతో స్వదేశంలో పంటలు బాగా దెబ్బతిన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

