ఖండాంతర క్షిపణి హాసాంగ్-17ను పరీక్షించిన ఉత్తర కొరియా
ప్యోంగ్యాంగ్: అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని పరీక్షించినట్లు ఇవాళ ఉత్తర కొరియా ప్రకటించింది. హాసాంగ్-17 మిస్సైల్‌ను తొలిసారి 2020లో ఆవిష్కరించారు. భారీ సైజు ఉన్న ఆ క్షిపణిని పరేడ్‌లో ప్రదర్శించారు. 2017 తర్వాత మళ్లీ గురువారం రోజున ఉత్తర కొరియా తొలిసారి ఐసీబీఎంను పరీక్షించినట్లు తెలుస్తోంది. ఖండాంతర క్షిపణులు సుదీర్ఘ దూరం ప్రయాణిస్తాయి. కొరియా నుంచి అమెరికాను కూడా అవి చేరుకోగలవు. వాస్తవానికి ఉత్తర కొరియాపై ఆ క్షిపణుల పరీక్ష బ్యాన్ ఉంది. దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాల మేరకు గురువారం ఐసీబీఎం పరీక్ష జరిగినట్లు ఆ దేశ మీడియా పేర్కొన్నది.
ఉత్తర కొరియా తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. అయితే అణ్వాయుధాల సమీకరణలో ఉత్తర కొరియా కొత్త మైలురాయిని చేరుకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. గురువారం జరిగిన ఐసీబీఎం పరీక్షను జపాన్, దక్షిణ కొరియా మిలిటరీలు ట్రాక్ చేశాయి. ఆ మిస్సైల్ సముద్ర మట్టానికి ఆరు వేల కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లినట్లు జపాన్ తెలిపింది. గంట సేపు ప్రయాణించిన తర్వాత అది జపాన్ జలాల్లో పడినట్లు తెలుస్తోంది. గతంలో హాసాంగ్-15 మిస్సైల్ 4500 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. ఇప్పుడు హాసాంగ్-17 ఆ పాత రికార్డును బ్రేక్ చేసింది.
ఒకవళ హాసాంగ్-15 క్షిపణిని.. స్టాండర్డ్ ట్రాజెక్టరీలో పైర్ చేసి ఉంటే, అది దాదాపు 13వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే గురువారం ప్రయోగించిన మిస్సైల్ మరింత ఎక్కువ దూరం వెళ్తుందని నిపుణులు అన్నారు. దీన్ని రాక్షస క్షిపణిగా పిలుస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

