Iran-US | హార్ముజ్‌ను అమెరికా దిగ్బంధిస్తే.. మేం పర్షియన్ గల్ఫ్ పోర్టుల్ని దిగ్బంధిస్తాం.. ఇరాన్ వార్నింగ్
Iran-US : హార్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న వేళ.. ఇరాన్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. అమెరికా అలాంటి చర్యలకు దిగితే, తాము కూడా పర్షియన్ గల్ఫ్ తీరంలోని పోర్టులను దిగ్బంధిస్తామని హెచ్చరించింది.
Iran-US : హార్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న వేళ.. ఇరాన్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. అమెరికా అలాంటి చర్యలకు దిగితే, తాము కూడా పర్షియన్ గల్ఫ్ తీరంలోని పోర్టులను దిగ్బంధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పర్షియన్ (అరేబియన్) గల్ఫ్, ఒమన్ సముద్ర తీరంలో భద్రత ఉంటే అందరికీ ఉండాలని, లేకపోతే ఎవరికీ ఉండకూడదని పేర్కొంది.
ప్రాంతీయ సముద్ర జలాల్లో రక్షణ అందరికీ ఒకేలా ఉండాలని అభిప్రాయపడింది. హార్ముజ్‌ను అమెరికా దిగ్బంధిస్తే గల్ఫ్ తీరంలోని ఏ ఒక్క పోర్టుకు రక్షణ ఉండబోదని ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ హెచ్చరించింది. తమ పోర్టుల్ని అమెరికా టార్గెట్ చేస్తే.. తాము గల్ఫ్ దేశాల పోర్టుల్ని టార్గెట్ చేస్తామని స్పష్టం చేసింది. రెండు రోజుల క్రితం ఇరాన్-అమెరికా మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని, ఇరాన్ పోర్టుల్ని దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు అమెరికన్ నేవీకి ఆదేశాలు కూడా జారీ చేశారు. హార్ముజ్‌ను దిగ్బంధించే ప్రక్రియ సోమవారం ఉదయం నుంచి ప్రారంభమవుతుందని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అంటే, ఇకపై ఈ జలసంధి నుంచి నౌకలు వెళ్లడం, రావడం జరగవు.
రెండు వైపులా నౌకల రవాణాను నిలిపివేస్తారు. అయితే, ప్రస్తుతానికి మాత్రం హార్ముజ్ జలసంధి నుంచి ఇరాన్‌తో సంబంధం లేని నౌకల రవాణా మాత్రం కొనసాగుతోంది. అయితే, ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నౌకలు నెమ్మదిగా కదులుతున్నట్లు ట్రాకింగ్ డాటా చెబుతోంది. మరోవైపు ఇక్కడి నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పిస్తామని ఐఆర్జీసీ ప్రకటించింది. ఇరాన్ అనుమతి పొందిన నౌకలను మాత్రమే రవాణాకు అంగీకరిస్తామని, శతృదేశాల నౌకలను అనుమతించబోమని పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

