నీరవ్ మోదీని భారత్‌కు అప్పగింతలో ముందడుగు… అనుకూలంగా యూకే కోర్టు తీర్పు
పరారీలో ఉన్న ఆయనను భారత్‌కు అప్పగించేందుకు అనుమతిస్తూ లండన్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,000 కోట్ల మేర మోసగించి బ్రిటన్ పారిపోయిన గుజరాత్ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడంలో ముందడుగు పడింది. తనను భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, మానసిక ఆరోగ్య కారణాలను పేర్కొంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను లండన్ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. నీరవ్ అప్పీల్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జేతో కూడిన ధర్మాసనం, పరారీలో ఉన్న ఆయనను భారత్‌కు అప్పగించేందుకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది.
‘నీరవ్ మోడీ మానసిక పరిస్థితి, ఆయన ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం, ఆయనను అప్పగించడం అన్యాయమని లేదా అణచివేతకు గురిచేస్తుందని మేం భావించడం లేదు. నీరవ్ చేసిన వాదనలపై మేం సంతృప్తి చెందలేదు’ అని కోర్టు పేర్కొంది. అక్టోబర్ 12న రిజర్వ్ చేసిన తీర్పును బుధవారం వెల్లడించింది.
మరోవైపు లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్న 51 ఏళ్ల నీరవ్ మోదీ, లండన్ హైకోర్టు తీర్పుపై 14 రోజుల్లోగా బ్రిటన్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అయితే సాధారణంగా ప్రజా ప్రాముఖ్యత ఉంటేనే సుప్రీంకోర్టులో అప్పీల్‌కు హైకోర్టు అంగీకరిస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

