Nikki Haley | అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్న నిక్కీ హేలీ
Nikki Haley | అమెరికా అధ్యక్ష బరిలో నుంచి భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ తప్పుకున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిగా ట్రంప్‌తో పోటీపడిన ఆమె.. రేసు నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. దీంతో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి జో బైడెన్ డోనాల్డ్ ట్రంప్ తలపడనుండటం ఖాయమైపోయింది.
Nikki Haley | అమెరికా అధ్యక్ష బరిలో నుంచి భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ తప్పుకున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిగా ట్రంప్‌తో పోటీపడిన ఆమె.. రేసు నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. దీంతో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ తలపడనుండటం ఖాయమైపోయింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డోనాల్డ్ ట్రంప్‌తో నిక్కీ హేలీ, వివేక్ రామస్వామితో పాటు చాలామందే పోటీపడ్డారు. కానీ ప్రైమరీ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి మాజీ అధ్యక్షుడు ట్రంప్ టాప్‌లో కొనసాగుతూ వస్తున్నారు. దీంతో ఒకరి తర్వాత ఒకరు వైదొలగడంతో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్‌నకు పోటీగా నిక్కీ హేలీ మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో మార్చి 5వ తేదీన జరిగిన సూపర్ ట్యూజ్ డే రేసులో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ట్రంప్‌నే విజయం సాధించారు. ఒక్క వెర్మౌంట్ రాష్ట్రంలో మాత్రమే నిక్కీ హేలీ విజయం సాధించారు. దీంతో రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక కావాలంటే 1215 మంది ప్రతినిధుల మద్దతు కావాల్సి ఉండగా.. ట్రంప్‌నకు 995 మంది మద్దతు లభించింది. నిక్కీ హేలీకి 89 మంది మద్దతు మాత్రమే ఉన్నారు. ట్రంప్‌తో పోలిస్తే నిక్కీ హేలీ చాలా వెనుకబడి ఉండటంతో ఆమె పోటీ నుంచి తప్పుకుంటారని ముందు నుంచే వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే సౌత్ కరోలినాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హేలీ మాట్లాడుతూ.. పోటీ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. తన క్యాంపెయిన్ నిలిపివేయాల్సిన సమయం వచ్చిందని.. దీనికి తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఈ సందర్భంగా నిక్కీ హేలీ తెలిపారు. ఇకపై అభ్యర్థి కాకపోయినా.. నమ్మిన అంశాలపై మాత్రం గళం వినిపించడం ఆపనని స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

