వెల్లింగ్టన్, మే 3: మా కంపెనీలో చేరే ఉద్యోగులకు నచ్చినన్ని సెలవులు ఇస్తాం అని ఓ కంపెనీ ప్రకటిస్తే ఎలా ఉంటుంది? నమ్మలేకపోతున్నారా? న్యూజిలాండ్‌లోని ‘యాక్షన్స్టెప్’ అనే కంపెనీ ఉద్యోగులకు అపరిమిత సెలవులు ఇస్తున్నది. ఏడాదికి వరుసగా 30 రోజులు సెలవులు తీసుకొన్నా.. ఆ కంపెనీలో ఎవరూ ఉద్యోగులను ప్రశ్నించరు.
వేతనం కూడా కట్ చేయరు. ఉద్యోగులకు ఆనందంతో కూడిన పని వాతావరణాన్ని కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఆ యాజమాన్యం పేర్కొంది. ‘హై ట్రస్ట్ మోడల్’ పేరిట తీసుకొచ్చిన ఈ విధానాన్ని ప్రఖ్యాత సంస్థలు లింక్డ్ఇన్, నెట్‌ఫ్లిక్స్ కూడా గతంలో ప్రయోగాత్మకంగా అనుసరించాయి.