Doctor | న్యూయార్క్, ఏప్రిల్ 9: తమపై లైంగిక దాడికి పాల్పడినట్టు 100 మందికిపైగా బాలికల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లల వైద్యుడు స్టువర్ట్ కాపర్మ్యాన్ను 160 కోట్ల డాలర్ల (రూ.13,867 కోట్లు) నష్టపరిహారాన్ని చెల్లించవలసిందిగా న్యూయార్క్ సుప్రీంకోర్టు ఆదేశించింది. 1980వ దశకంలో లాంగ్ ఐల్యాండ్‌లో ప్రాక్టీసు చేస్తున్న కాలంలో కాపర్మ్యాన్ చికిత్స నిమిత్తం తన వద్దకు వచ్చిన బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు నమోదయ్యాయి.
అతనిపై డజన్ల సంఖ్యలో ఆరోపణలు వచ్చినప్పటికీ నేరానికి పాల్పడినట్టు అతనిపై కేసు నమోదు కాలేదు. తన 65వ ఏట రిటైర్మెంట్కు దగ్గరవుతున్న సమయంలో అతని మెడికల్ లైసెన్సు రద్దయ్యింది. సౌత్ ఫ్లోరిడాలో నివసిస్తున్న కాపర్మ్యాన్ వయసు ఇప్పుడు 89 ఏళ్లు. తన వద్దకు వచ్చే రోగులకు తాను క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించానే తప్ప వారిపై లైంగిక దాడికి పాల్పడలేదని కాపర్మ్యాన్ వాదించాడు.
అయితే తమ తల్లిదండ్రులను బలవంతంగా బయటకు పంపించి తమపై డాక్టర్ లైంగిక దాడికి పాల్పడేవాడని అతని పూర్వ రోగులు కోర్టుకు తెలిపారు. నష్టపరిహారంగా 2.5 కోట్ల డాలర్ల(రూ. 160 కోట్లు) పొందిన రెవరెండ్ డబ్బీ రోడ్స్ తీర్పుపై స్పందిస్తూ .ఇన్నేళ్లు శిక్ష నుంచి తప్పించుకున్న డాక్టర్‌కు ఎట్టకేలకు శిక్ష పడిందని చెప్పారు.