Preeclampsia Risk | గర్భిణీల్లో ఆ సమస్యను గుర్తించేందుకు సరికొత్త పరీక్ష.. ఆమోదించిన FDA
Preeclampsia Risk | ప్రీక్లాంప్సియా అనేది తీవ్రమైన అధిక రక్తపోటు సంబంధ రుగ్మత. ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 నుంచి 8 శాతం మంది గర్భిణీ స్త్రీలను ప్రభావితం చేస్తున్నది. ప్రస్తుతం ఆమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA).. గర్భిణీల్లో ప్రీక్లాంప్సియాను ముందుగా అంచనా వేయడానికి సహాయపడే ఓ నూతన రక్త పరీక్షకు ఆమోదం తెలిపింది.
Preeclampsia Risk : ప్రీక్లాంప్సియా అనేది తీవ్రమైన అధిక రక్తపోటు సంబంధ రుగ్మత. ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 నుంచి 8 శాతం మంది గర్భిణీ స్త్రీలను ప్రభావితం చేస్తున్నది. ప్రస్తుతం ఆమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA).. గర్భిణీల్లో ప్రీక్లాంప్సియాను ముందుగా అంచనా వేయడానికి సహాయపడే ఓ నూతన రక్త పరీక్షకు ఆమోదం తెలిపింది. సాధారణంగా వైద్యులు ప్రీక్లాంప్సియా రిస్క్‌ను చెక్ చేయడానికి మూత్ర పరీక్ష ద్వారా రక్తపోటును, ప్రోటీన్లను పరిశీలిస్తారు. కానీ గర్భం పెరిగి పెద్దది అవుతున్నా కొద్దీ ఈ పరీక్షలు పేలవమైన ఫలితాలను ఇస్తాయి. పైగా గర్భిణీలు వైకల్యానికి గురయ్యే, మరణించే రిస్క్ పెరుగుతుంది.
తాజాగా FDA ఆమోదించిన కొత్త పరీక్ష రక్తంలోని sFlt1, PIGF అనే రెండు ప్రొటీన్లను గుర్తించడం ద్వారా ఫలితాన్ని తెలుపుతుంది. ఇది ప్రస్తుతం అమలులో ఉన్న ప్రీక్లాంప్సియా పరీక్షా పద్ధతుల కంటే చాలా మెరుగైనది, కచ్చితమైనది. గర్భధారణ సమయంలో రక్తపోటు లక్షణాలను కలిగి ఉన్న లేదా నిర్ధారణ అయిన మహిళల్లో తీవ్రమైన ప్రీఎక్లంప్సియాను అంచనా వేయడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. మహిళ గర్భం దాల్చిన తర్వాత 23వ వారం నుంచి 35వ వారం మధ్య ఈ పరీక్షను చేయించుకోవచ్చు. యూనివర్శిటీ ఆఫ్ చికాగోలోని మాతాశిశు వైద్య విభాగం అధిపతి, గైనకాలజీ ప్రొఫెసర్ సరోష్ రాణా మాట్లాడుతూ.. వైద్యులు తమ రోగుల్లో ప్రీక్లాంప్సియా నిర్ధారణకు చేసే ఇతర పరీక్షలతోపాటు ఈ పరీక్షను కూడా చేయవచ్చన్నారు.
ప్రీక్లాంప్సియాను ప్రధానంగా అధిక రక్తపోటును గుర్తించడం ద్వారా వర్గీకరిస్తారు. అదేవిధంగా మూత్రంలో అధిక మొత్తంలో ప్రోటీన్, అవయవాల డ్యామేజ్ ద్వారా కూడా ప్రీక్లాంప్సియాను అంచనా వేయవచ్చు. కొంతమంది మహిళల్లో ఎలాంటి లక్షణాలు బయటికి కనిపంచనప్పటికీ ప్రీక్లాంప్సియాను కలిగి ఉంటారు. ఇది గర్భిణిలో, శిశువులో సమస్యలకు, అలాగే ముందస్తు ప్రసవానికి కారణం అవుతుంది. శిశువు గర్భం వెలుపల జీవించలేని వయస్సులో ఉన్నట్లయితే వైద్యులు తల్లి అనారోగ్యాన్ని కంట్రోల్ చేయడానికి యాంటీ హైపర్టెన్సివ్ మందులైన మెగ్నీషియం, స్టెరాయిడ్లు ఇస్తారు. ప్రీక్లాంప్సియా ప్రభావాలు జీవితాంతం కూడా ఉండే అవకాశం ఉందని సరోష్ రాణా చెబుతున్నారు.
ప్రీక్లాంప్సియా ఉన్న స్త్రీలకు వారి జీవితాంతం స్వల్పకాలిక, దీర్ఘకాలిక రక్తపోటు రుగ్మతలు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆమె చెప్పారు. ఇప్పుడు FDA ఆమోదించిన కొత్త పరీక్ష ద్వారా అధిక-రిస్క్ ఉన్నట్లు గుర్తిస్తే మెరుగైన వైద్యం కోసం అధిక కేర్ ఉన్న యూనిట్లో వైద్యం అందించవచ్చని తెలిపారు. అదేవిధంగా ఈ పరీక్ష ద్వారా ప్రీక్లాంప్సియాతో తక్కువ రిస్క్ ఉందని తేలిన వారిలో, ప్రీక్లాంప్సియా ఉన్నదో లేదో అనేది కచ్చితంగా నిర్ధారణ కాని వారిలో ముందస్తు డెలివరీ రిస్క్‌ను తగ్గించవచ్చన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

