Netherlands | నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రట్ రాజీనామా.. కుప్పకూలిన సంకీర్ణ ప్రభుత్వం
ప్రధాని మార్క్ రట్ (PM Mark Rutte) తన పదవికి రాజీనామా చేయడంతో నెదర్లాండ్స్‌లోని (Netherlands) సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దేశంలోకి వలసల నిరోధంపై (Migration policy) కూటమిలోని నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రధాని మార్క్ రట్ తప్పుకున్నారు.
ఆంస్టర్డామ్: ప్రధాని మార్క్ రట్ (PM Mark Rutte) తన పదవికి రాజీనామా చేయడంతో నెదర్లాండ్స్‌లోని (Netherlands) సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దేశంలోకి వలసల నిరోధంపై (Migration policy) కూటమిలోని నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రధాని మార్క్ రట్ తప్పుకున్నారు. తనతోపాటు మంత్రిమండలి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వలసల విధానంపై ఏకాభిప్రాయం కోసం కొన్ని రోజులుగా పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
వలసలను అడ్డుకునే విషయంలో తమ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందేనని ప్రధాని మార్క్ రట్ అన్నారు. ఈసారి చర్చల్లోనూ భాగస్వామ్యపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయని, దీంతో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. రాజీనామా లేఖను నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ అలెక్సాండర్‌కు (King Willem Alexander) అందజేశారు. అధికారం చేపట్టిన ఏడాదికే సంకీర్ణం ప్రభుత్వం కూలిపోవడం గమనార్హం.
దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా మార్క్ రట్ నిలిచారు. 2010లో ఆయన తొలిసారిగా ప్రధాని బాధ్యతలు చేపట్టారు. గతేడాది జనవరిలో ఆయన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టింది. కాగా, రట్ రాజీనామాతో పార్లమెంటులోని దిగువసభలో ఉన్న 150 సీట్లకు ఈ ఏడాది చివర్లో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
కాగా, విదేశీ శరణార్థులతో వలసల శిబిరాలు కిక్కిరిసిపోయిన విషయం గతేడాది వెలుగులోకి రావడం దేశంలో సంచలనానికి దారితీసింది. దీంతో, వలసల కట్టడికి వీవీడీ పార్టీ నేత మార్క్ రట్ ప్రయత్నించారు. విదేశీ శరణార్థుల కుటుంబసభ్యులను దేశంలోకి అనుమతించడంపై పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

