Nepal PM | ఈ నెల 21న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న నేపాల్ ప్రధాని
Nepal PM | నేపాల్ ప్రధాని (Nepal PM) కేపీ శర్మ ఓలి (KP Sharma Oli) ఈ నెల 21న (ఆదివారం) పార్లమెంటులో విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. మూడు రోజుల క్రితమే నేపాల్ ప్రధానిగా ప్రమాణం చేసిన ఆయన విశ్వాస పరీక్ష నెగ్గేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తం 275 సీట్లున్న సభలో నేపాల్ పార్లమెంటులో విశ్వాస తీర్మానం నెగ్గాలంటే 138 మంది సభ్యుల మద్దతు అవసరం.
Nepal PM : నేపాల్ ప్రధాని (Nepal PM) కేపీ శర్మ ఓలి (KP Sharma Oli) ఈ నెల 21న (ఆదివారం) పార్లమెంటులో విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. మూడు రోజుల క్రితమే నేపాల్ ప్రధానిగా ప్రమాణం చేసిన ఆయన విశ్వాస పరీక్ష నెగ్గేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తం 275 సీట్లున్న సభలో నేపాల్ పార్లమెంటులో విశ్వాస తీర్మానం నెగ్గాలంటే 138 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే నేపాల్ కాంగ్రెస్ మద్దతు కలిగిన ఓలీ సంకీర్ణ సర్కారుకు పార్లమెంట్లో మెజారిటీకి మించిన బలమే ఉన్నది. కాబట్టి ఆయన విశ్వాస పరీక్ష నెగ్గడం నల్లేరుపై బండినడకే కానున్నది.
కాగా రాజకీయ అస్థిరతకు మారు పేరైన నేపాల్‌లో జూలై 14న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ప్రధాని కేపీ శర్మ ఓలీ గత సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 22 మంది మంత్రులు ప్రమాణం చేశారు. నేపాల్ ప్రధానిగా ఓలీ బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం. అంతకుముందు ప్రధానిగా ఉన్న పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవలే కుప్పకూలింది. శుక్రవారం ప్రజా ప్రతినిధుల సభలో జరిగిన అవిశ్వాస పరీక్షలో ప్రచండ ఓడిపోయారు.
మొత్తం 275 సీట్లున్న నేపాల్ పార్లమెంటులో విశ్వాస తీర్మానం నెగ్గడానికి 138 సీట్లు అవసరం కాగా.. ప్రచండకు అనుకూలంగా 63 సీట్లు మాత్రమే వచ్చాయి. 194 ఓట్లు వ్యతిరేకంగా పడటంతో ప్రచండ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. దీంతో నేపాల్-యునైటెడ్ మార్క్సి స్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-యూఎంఎల్), నేపాల్ కాంగ్రెస్ (ఎన్సీ)ల కలయికతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం నుంచి కొత్త ప్రధానిగా ఓలిని ఎన్నుకున్నారు. నేపాల్ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ ఆదివారం ఆయనను నూతన ప్రధానిగా నియమించారు.
ఓలి నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ) కూటమి మధ్య కొన్ని రోజుల క్రితమే అధికారం పంచుకోవడంపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. తొలి 18 నెలలు ఓలి ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసే వరకూ దేవ్బా ప్రధానిగా కొనసాగుతారు. కాగా ఓలి గతంలో మూడుసార్లు నేపాల్ ప్రధానిగా పనిచేశారు. 2015 అక్టోబర్ 11 నుంచి 2016 ఆగస్టు 3 వరకు, 2018 ఫిబ్రవరి 5 నుంచి 2021 జూలై 13 వరకు, ఆ తర్వాత కూడా మరోసారి కొన్ని రోజులపాటు ఆయన ప్రధానిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగోసారి ప్రధాని పీఠం ఎక్కారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

