వాషింగ్టన్, అక్టోబర్ 7: ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టేలా 5 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ అయ్యే టెక్నాలజీని నాసా అభివృద్ధి చేసింది. అంతరిక్ష మిషన్ల కోసం నాసా నిధులతో పర్డ్యూ వర్సిటీ పరిశోధకులు ‘సబ్‌కూల్డ్ ఫ్లో బాయిల్డ్’ టెక్నాలజీని రూపొందించారు.
ఈ కొత్త పద్ధతిలో చార్జింగ్ కేబుల్ ద్వారా లిక్విడ్ కూలెంట్‌ను పంప్ చేస్తారు. ఇక్కడ అది కరెంట్ వాహక కండక్టర్ ద్వారా ఉత్పత్తైన వేడిని గ్రహిస్తుంది. ఇది 2,400 ఆంపియర్ల కరెంట్‌ను అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చార్జర్ల కంటే 4.6 రెట్లు ఎక్కువగా కరెంట్‌ను అందజేస్తుంది. ఈ కొత్త టెక్నాలజీతో చార్జింగ్ సమయం తగ్గిపోతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.